రాజా రవీంద్రకి ఇంత నోటి దూల ఉందా ? రాజీవ్ కనకాల చంపేసినంత పని చేశాడా ?
TeluguStop.com
టాలీవుడ్ లో సీనియర్ నటులలో ఒకరు రాజా రవీంద్ర( Raja Ravindra ).
1988 లో యముడికి మొగుడు చిత్రం తో సినీ ప్రేక్షకులకు పరిచయమైన ఈయన తన 30 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణంలో అనేక సినిమాలు, సీరియల్స్ లో నటించారు.
ఎన్నో ఏళ్ళ అనుభవం ఉన్నఈ 52 ఏళ్ళ నటుడికి నోటి దురుసు బాగా ఎక్కువట.
ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే ఒక ఇంటర్వ్యూలో వెళ్లబుచ్చారు.తన నోటి దురుసు తో చాలా మందిని బాధ పెట్టారట.
చాలా సార్లు దెబ్బలు తినే స్థాయికి వెళ్లారట.ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం.
"""/" /
రాజీవ్ కనకాల( Rajeev Kanakala ), రాజా రవీంద్ర చాలా సినిమాలలో కలిసి నటించారు.
ఒక సినిమా షూటింగ్ లో రాజీవ్ కనకాల మెడ బెణికి నొప్పితో బాధ పడుతున్నారట.
అదే సమయంలో రాజా అక్కడికి వెళ్లారట.ఒక పక్కన మెడకు పట్టి వేసుకొని కూర్చున్న రాజీవ్ ని చూసి "ఏం రాజీవ్.
హెడ్ కి వెయిట్ ఎక్కువయింది?" అని జోక్ చేశారట.ఆ మాటకు రాజీవ్ కనకాల చాలా సీరియస్ అయ్యారట.
నీకు నాకు ఫ్రెండ్ షిప్ కూడా లేదు నోటికి ఏది వస్తే అది మాట్లాడతావా అంటూ చంపేసినంత పని చేశారట.
ఆ విషయాన్నీ గుర్తు చేసుకొని మా భీమవరం ( Bhimavaram )వాళ్లకు నోటి దురుసు ఏక్కువ ఉంటుంది అని చెప్పుకోచ్చాడు.
"""/" /
తన మొదటి సినిమా నుంచే రాజా రవీంద్రకు, మెగా స్టార్ చిరంజీవికి మంచి సాన్నిహిత్యం ఉంది.
వీళ్లిద్దరు కలిసి చాలా సినిమాలలో నటించారు.ఐతే రాజా రవీంద్ర ఎప్పుడు చిరంజీవితో తిట్లు తినేవారట.
కారణం ఏమిటంటే చిరంజీవి షాట్ చేసేటప్పుడు రాజా ఎప్పుడు చిరంజీవి కళ్ళల్లో కళ్ళు పెట్టి అదే పనిగా చూస్తూ ఉండేవాడట.
ఆలా చూడవద్దని, తనకు డిస్టర్బన్స్ గా ఉంటుందని చిరంజీవి ఎన్నిసార్లు చెప్పిన రాజా మాత్రం ఆ అలవాటును మార్చుకోలేదట.
తాజాగా ఆచార్య షూటింగ్ లో కూడా ఇదే రిపీట్ అయ్యిందట.చిరంజీవి యాక్ట్ చేస్తుండగా రాజా అదే పనిగా చూస్తుంటే.
"నువ్విక మారావురా" అంటూ తిట్టుకుంటూ వెళ్లిపోయారట చిరంజీవి.ఐతే ఈ సంఘటనలన్నీ సరదాగా ఉన్నప్పటికీ ఇలా ఎదుటివారి పై జోక్స్ వెయ్యడం సరి కాదని, ఈ విషయం తనకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోందని అన్నారు రవీంద్ర.