షారుఖ్ ఖాన్ పాదాలను తాకిన రానా దగ్గుబాటి.. రానా రెస్పెక్ట్ కు ఫిదా అవ్వాల్సిందే!

తాజాగా ముంబైలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో IIFA అవార్డ్స్ 2024 ప్రెస్ కాన్ఫరెన్స్( IIFA Awards 2024 Press Conference ) చాలా గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే.

ఈ కాన్ఫరెన్స్ కు ప్రముఖ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్, బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్, పాన్ ఇండియా హీరో రానా దగ్గుబాటి, సిద్ధాంత్ చతుర్వేది, అభిషేక్ బెనర్జీ వంటి పలువురు ప్రముఖులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.

అయితే ఈ ఈవెంట్ లో జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

షారుఖ్ ఖాన్, కరణ్ జోహార్ లు రానా దగ్గు బాటిని( Rana DagguBati ) స్తేజ్ మీదకి పిలిచారు.

"""/" / రానా దగ్గుబాటి, షారుఖ్ ఖాన్, కరణ్ జోహార్ ( Shahrukh Khan , Karan Johar )ఇద్దరి పాదాలను తాకి, మేము పూర్తిగా సౌత్ ఇండియన్.

మేము దీన్ని ఇలా చేస్తాము అని అన్నాడు.గౌరవ సూచకంగా నటుడు రానా దగ్గుబాటి చేసిన పనికి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాగా రానా చేసిన పనికి అక్కడున్న సెలబ్రిటీలు కూడా ఆశ్చర్యపోయారు.అంత పెద్ద హీరో అయ్యి ఉండి అలా ప్రవర్తించడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

రానా గారు నిజంగా చాలా గ్రేట్, అయినా రెస్పెక్ట్ కు ఫిదా అవ్వాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

"""/" / కాగా IIFA అవార్డ్స్ 2024 ఈవెంట్ సెప్టెంబర్ నెల 27, 29 మధ్య UAEలో జరుగుతుంది.

ఇకపోతే హీరో రానా విషయానికి వస్తే.రానా ప్రస్తుతం అడపాదడపా సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇటీవల ఒక వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించిన రానా ప్రస్తుతం రెండు మూడు సినిమా లలో నటిస్తున్నారు.

ప్రస్తుతం కేవలం బిజినెస్ ల పైన ఫోకస్ పెట్టిన రానా సినిమాల విషయంలో చాలా తక్కువ యాక్టివ్ గా కనిపిస్తున్నారు.

బాహుబలి సినిమా తర్వాత చాలా తక్కువ సినిమాలలో మాత్రమే నటించారు.

మొదటిసారి లవ్ స్టోరీ బయటపెట్టిన కీర్తి సురేష్.. ప్రామిస్ రింగ్ తొడిగాడంటూ!