ఆగస్టులోనే విడుదల పెట్టుకుంటున్న బుజ్జిగాడు
TeluguStop.com
ఆగస్టు నుండి సినిమాల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే మొదట పెద్ద సినిమాలను విడుదల చేసి ప్రేక్షకులను థియేటర్ల ముందుకు రప్పించాలంటూ మేకర్స్ భావిస్తున్నారు.
కాని పెద్ద సినిమాలు ఈ విపత్తు సమయంలో విడుదలకు అస్సలు ఆసక్తి చూపడం లేదు.
వచ్చే ఏడాది ఆరంభం వరకు పెద్ద సినిమాలు ఒక్కటి అంటే కనీసం ఒక్కటి కూడా విడుదల అయ్యే అవకాశం లేకపోవడంతో చిన్న సినిమాలకే క్యూ కడుతున్నాయి.
బొమ్మ పడేందుకు స్విచ్ ఆన్ చేయడమే ఆలస్యం వెంటనే రాజ్ తరుణ్ నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రంను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు.
ఈ సినిమాను థియేటర్లు ఓపెన్ అయిన రోజునే విడుదల చేయాలనే నిర్ణయానికి మేకర్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది.
ఏం జరిగితే అదే జరిగింది అంటూ ఈ ధైర్యంను చేయబోతున్నారు.థియేటర్లలో ఆకట్టుకోకుంటే వెంటనే ఓటీటీ లో విడుదల చేస్తారట.
"""/"/
రాజ్ తరుణ్‌కు ఈ సినిమా ఎంతో కీలకం.ప్రస్తుతం ఈయన చేస్తున్న ఇతర సినిమాల భవిష్యత్తు, ఆయన సినీ కెరీర్ మొత్తం కూడా ఈ సినిమాపై ఆదారపడి ఉంది.
గుండెజారి గల్లంతయ్యిందే సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు విజయ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
పెద్ద ఎత్తున ఆ మద్య ప్రచారం చేసి విడుదలకు సిద్దం చేయగా లాక్ డౌన్ కారణంగా అర్థంతరంగా ఆగిపోయింది.
మళ్లీ ఆగస్టులో విడుదలకు సిద్దం చేస్తున్నారు.
సినిమా విడుదలని నిర్ణయిస్తున్న ఓటిటి సంస్థలు.. గతి తప్పితే కష్టమే !