పాపం.. ఆ హీరో బొమ్మ వెండితెరపై పడకుండానే వస్తోంది!

ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని నివారించేందుకు భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే.

ఈ లాక్‌డౌన్ కారణంగా అన్ని రంగాలకు చెందని కార్యకలాపాలు నిలిచిపోయాయి.ఈ లాక్‌డౌన్ ఎఫెక్ట్ సినిమా రంగంపై కూడా తీవ్రంగా పడింది.

సినిమా ఇండస్ట్రీలోని అన్ని పనులు కూడా నిలిచిపోవడంతో చాలా మంది కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అయితే సినిమా కార్మికులను ఆదుకునేందుకు సినీ రంగానికి చెందిన పలువురు కార్మికులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.

కాగా సినిమా షూటింగ్‌లు కూడా ఎక్కడికక్కడ ఆగిపోగా రిలీజ్ కావాల్సిన సినిమాలు సైతం వాయిదా పడ్డాయి.

అయితే కరోనా ప్రభావం తగ్గకపోగా రోజురోజుకూ పెరుగుతుండటంతో ఈ లాక్‌డౌన్‌ను పొడగించాలని ప్రభుత్వం చూస్తోంది.

దీంతో లాక్‌డౌన్ ఇప్పట్లో ఎత్తేయడం వీలుకాకపోవచ్చని భావించిన ఓ చిత్ర యూనిట్, తమ సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తోంది.

యంగ్ హీరో రాజ్ తరుణ్, అందాల భామ మాళవికా నాయర్ నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రాన్ని నేరుగా ఓటీటీ డిజిటల్ ప్లాట్‌ఫాంపై రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ప్రస్తుతం ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావడంతో వారంతా టీవీలకు, ఫోన్లకు అతుక్కుపోయారు.దీంతో ఈ సినిమాను ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తే ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

విజయ్ కుమార్ కొండా డైరెక్ట్ చేసిన ఈ సినిమాను నిజంగానే ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తారా అనేది చూడాలి.

థమన్ ఆవేదన గురించి రియాక్ట్ అయిన చిరంజీవి.. అలా కామెంట్లు చేశారా?