ఆ అమ్మాయి చేతిలో మోసపోయిన రాజ్ తరుణ్.. అంతు చూస్తానంటూ?

ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్ సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న రాజ్ తరుణ్ ఆ తర్వాత పదుల సంఖ్యలో సినిమాలలో నటించినా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాపవుతున్నాయి.

రాజ్ తరుణ్ నటించిన కొన్ని సినిమాలు థియేటర్లలో ఎప్పుడు విడుదలయ్యాయో ఆయన అభిమానులకు కూడా తెలియదంటే ఆ సినిమాల పరిస్థితి ఏంటో సులువుగానే అర్థమవుతుంది.

అయితే రాజ్ తరుణ్ ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియోను పోస్ట్ చేయగా ఆ వీడియో ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది.

రాజ్ తరుణ్ ఆ వీడియోలో ఒక అమ్మాయి గురించి మీకు చెప్పడం కోసమే అకస్మాత్తుగా ఈ వీడియో చేస్తున్నానని నా లైఫ్ లో అమ్మాయి గురించి మాట్లాడే ఛాన్స్ వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని పేర్కొన్నారు.

నా లైఫ్ కు లవ్ సెట్ కాదని భావించి పెళ్లి చేయమని పేరెంట్స్ ను కోరానని రాజ్ తరుణ్ అన్నారు.

పేరెంట్స్ మంచి పెళ్లి సంబంధం చూశారని అయితే పెళ్లిరోజున అమ్మాయి జంప్ అని రాజ్ తరుణ్ అన్నారు.

ఆ సమయంలో చుట్టాలంతా సానుభూతితో చూశారని ఆ అమ్మాయి ఎక్కడ ఉన్నా వదలనని రాజ్ తరుణ్ పేర్కొన్నారు.

"""/"/ ఆ అమ్మాయి అంతు చూస్తానని ఆ అమ్మాయి ఎక్కడ ఉన్నా పట్టుకుంటానని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చారు.

రేపే అమ్మాయి ఫోటో ఆన్ లైన్ లో పెడుతున్నానని అమ్మాయి కనిపిస్తే చెప్పాలని రాజ్ తరుణ్ పేర్కొన్నారు.

రాజ్ తరుణ్ తన కొత్త సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ విధంగా వీడియో చేశాడని తెలుస్తోంది.

అయితే సెలబ్రిటీలు ఇలాంటి ప్రాంక్ వీడియోలు చేయడం ద్వారా సినిమాలకు చెడు ఎక్కువగా జరుగుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

వరుస ఫ్లాపుల నేపథ్యంలో రాజ్ తరుణ్ కొత్త ప్రాజెక్ట్ ల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అట్లీ హ్యాండిచ్చిన మరో తమిళ్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అల్లు అర్జున్…