తప్పు పైన తప్పు చేస్తున్న హీరో రాజ్ తరుణ్..ఇలా చేస్తే ఇంకా పాతాళానికే!

రాజ్ తరుణ్ ( Raj Tarun )టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తున్నాడు.

రొమాంటిక్ కామెడీ సినిమాలు తీస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈ హీరో సినిమా చూపిస్త మావా, కుమారి 21F, ఈడో రకం ఆడో రకం, అంధగాడు వంటి హిట్ సినిమాల్లో యాక్టింగ్ ఇరగదీసేసాడు.

సింపుల్‌గా చెప్పాలంటే పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశాడు.ఇప్పుడు రెండు సినిమాల్లో హీరోగా చేస్తున్నాడు.

కెరీర్ లైఫ్ బాగానే ఉన్నా అతడి వ్యక్తిగత జీవితమే ముళ్ల బాటలాగా మారింది.

ఇంతకుముందు రాజ్ తరుణ్ లావణ్య( Lavanya ) అనే అమ్మాయితో సహజీవనం చేశాడట.

మొదట పెళ్లి చేసుకుంటానని చెప్పి వాడుకొని ఆ తర్వాత వేరే మోడల్, హీరోయిన్‌తో రాజ్ తరుణ్ రిలేషన్‌షిప్ పెట్టుకున్నాడని ఆమె ఒక చీటింగ్ కేసు పెట్టింది.

ఈ కేసు తర్వాత రాజ్ తరుణ్‌ తప్పుల మీద తప్పుడు చేస్తున్నాడు.రీసెంట్‌గా ఈ హీరో పోలీసు విచారణకు తాను రాలేనని తన న్యాయవాది ద్వారా వర్తమానం పంపాడు.

"నాకు కొత్త సినిమా షూటింగ్ ఉంది.ప్రమోషన్ ఈవెంట్స్ లో కూడా పాల్గొనాలి కాబట్టి నేను విచారణకు రాలేను" అన్నట్లుగా ఒక మెసేజ్ పంపించాడట.

దీనివల్ల అతనికి చాలా నష్టం జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. """/" / ప్రస్తుతానికి రాజ్ తరుణ్ పై పోలీసులు ఎలాంటి సెక్షన్లను బనయించారో తెలియదు.

వాటి తీవ్రత ఏంటి, వాటివల్ల జీవితంపై ఎంత ఎఫెక్ట్ పడుతుందనే సంగతి కూడా రాజ్ తరుణ్ తెలుసుకొని ఉండడు.

ఈ పోలీస్ కేసులను లైట్ తీసుకుంటే చివరికి అతడికే పెద్ద నష్టం జరిగే అవకాశం ఉంది.

ఇలా జరగకుండా ఉండాలంటే రాజ్ తరుణ్ లాయర్‌తో సహా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి విచారణకు హాజరు కావడం ముఖ్యం.

చాలామంది సినిమా సెలబ్రిటీలు ఇంతకుముందు తాము విచారణకు రాలేమంటూ మొండి పట్టు పట్టారు.

చివరికి పోలీసులు కోర్టు ద్వారా వారంట్‌ తీసుకొని వాళ్లను జైల్లో పెట్టారు. """/" / విచారణకు సహకరించకపోతే ఎవరినైనా చివరకు జైల్లో వేస్తారు.

రాజ్ తరుణ్ తన మాజీ ప్రియురాలు లావణ్య డ్రగ్స్ తీసుకుంటుందని, వేరే వ్యక్తితో ఆమెకు సంబంధం ఉందని ఏవేవో చెబుతున్నాడు.

మరోవైపు రాజ్ తరుణ్ చెప్పేవన్నీ అబద్ధాలు అని లావణ్య అంటోంది.రాజ్ తరుణ్ అరియానా, హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో ( Ariana, Heroine Malvi Malhotra )అఫైర్ పెట్టుకున్నాడని ఆరోపిస్తోంది.

అయితే కోర్టులో ఈమె వేసిన కేసు చెల్లకపోవచ్చు.సహచరుడు వేరే వాళ్లతో అఫైర్ పెట్టుకోవడాన్ని తప్పుగా కోర్టు చూడకపోవచ్చు.

పెళ్లి కాలేదు కాబట్టి ఈ కేసులో తీర్పు ఒకరి వైపే ఉంటుందని చెప్పలేం.

అన్నిటినీ పరిశీలించి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని తెలుసుకున్న తర్వాతే కోర్టు తీర్పు ఇస్తుంది కాబట్టి ఇరువురు కూడా జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది లేకపోతే ఇద్దరికీ నష్టమే అని చెప్పుకోవచ్చు.

పాకిస్తాన్ కెప్టెన్ మొండి వాదన.. నేను అవుట్ కాదంటూ..