రెండు నెలల తర్వాత శిల్పా శెట్టిని కలిసిన రాజ్ కుంద్రా ఏం అన్నాడో తెలుసా?

పోర్నోగ్రఫీ కేసులో గత రెండు నెలల క్రితం అరెస్టు అయినటువంటి బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా రెండు నెలల తరువాత యాభై వేల రూపాయల పూచికత్తు బెయిలుపై మంగళవారం విడుదలయ్యారు.

ఎంతో మంది యువతను మభ్య పెట్టి వారితో అశ్లీల చిత్రాలను చిత్రీకరించి వాటిని యాప్స్ లో అప్లోడ్ చేస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారన్న ఆరోపణల కారణంగా ముంబై పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్టు చేసిన సంగతి మనకు తెలిసిందే.

గత రెండు నెలల నుంచి రాజ్ కుంద్రా బెయిల్ కోసం ఎన్నో సార్లు పిటిషన్ దాఖలు చేసిన కోర్టు తన పిటిషన్ ను కొట్టిపారేసింది.

అయితే రెండు నెలల తర్వాత 50 వేల రూపాయలను పూచికత్తుగా తీసుకొని అతడు దేశం విడిచి వెళ్ళిపోకుండా అతని పాస్ పోర్టులను స్వాధీనం చేసుకొని అతనికి బెయిల్ మంజూరు చేసింది.

ఇలా బెయిల్ మంజూరు కావడంతో రాజ్ కుంద్రా ఆర్థ‌ర్ రోడ్ జైలు నుంచి న‌డుచుకుంటూ బ‌య‌ట‌కు వచ్చి ఆయ‌న బ్లాక్ మెర్సిడెస్ కారులో జుహులోని త‌న బంగ్లాకు చేరుకున్నాడు.

"""/"/ ఇలా రెండు నెలల తర్వాత తన పిల్లలను భార్యను చూసిన రాజ్ కుంద్రా ఒక్కసారిగా ఎమోషనల్ అయినట్టు సన్నిహితవర్గాలు తెలియజేశారు.

రెండు నెలల తర్వాత తన భర్తను చూసేసరికి శిల్పాశెట్టి కూడా ఎమోషనల్ అయినట్లు తెలిపారు.

ఇలా కుంద్రా ఇంటికి రాగానే శిల్పాశెట్టి ఇంస్టాగ్రామ్ హ్యాండిల్స్ లో "నేల‌మీదికి నిన్ను తోసే క్ష‌ణాలుంటాయి, స‌రికొత్త సంక‌ల్పం, ప్రేర‌ణ‌తో తిరిగి నిల‌బ‌డ‌తావు.

"అంటూ మోటివేషనల్ కొటేషన్స్ పోస్ట్ చేశారు.

మహిళా క్యాషియర్‌పై జాతి విద్వేష వ్యాఖ్యలు.. సింగపూర్‌లో భారతీయుడికి జైలు