ట్రైన్ టికెట్ ధరలు పెంచారా? వాస్తవం ఇదే

కరోనా వైరస్ విజృంభణ తరువాత కేంద్రప్రభుత్వం లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.

అందులో భాగంగానే రైళ్ల రాకపోకలను నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ఇటీవల కొన్ని రైళ్ళకు రాకపోకలకు రిజర్వేషన్ ప్రాతిపదికన ప్రయాణికులకు అనుమతిస్తూ అనుమతులు మంజూరు చేసింది.

కాగా ఇప్పుడు రైళ్లలో ప్రయాణించే విషయంపై ఓ వార్త వైరల్ గా మారింది.

ట్రైన్ టిక్కెట్ల ధరలను పెంచినట్లు పెద్ద ఎత్తున ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది.

కేంద్రం ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ధరలను పెంచాలని నిర్ణయించిందని, అంతేకాక ఈ ధరల పెంపు నిర్ణయం జనవరి 6 నుండే అమలులోకి రానున్నదని పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పందించింది.

"""/"/ రైలు టిక్కెట్ల ధరలను పెంచారని వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని పీఐబీ ఫ్యాక్ట్ స్పష్టం స్పందించింది.

పీఐబీ ఈ వార్తలలో నిజం లేదని నిర్ధారణ చేయడంతో ఇది ఫేక్ న్యూస్ అని స్పస్టమయింది.

అంతే కాక ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రైళ్ల చార్జీలను పెంచే ఆలోచనలో లేదని పీఐబీ తెలిపింది.

మరి అన్ని రైళ్ల రాకపోకలు ప్రారంభమైన తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటుదనేది చూడాల్సి ఉంది.

గేమ్ చేంజర్ సినిమాతో శంకర్ దశ మారనుందా..?