తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు

తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురువనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది.

ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు.

అదేవిధంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, నాగర్ కర్నూలు, వనపర్తి మరియు గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

భారీ వానలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

నాయుడుగారి తాలూకా అంటున్న నాని… కొత్త సినిమా టైటిల్ ఇదేనా?