సరిపోదా శనివారంకు ఊహించని దెబ్బ.. అలా జరిగితే మాత్రమే సినిమాకు మేలు జరుగుతుందా?

నాచురల్ స్టార్ నాని( Nani ) డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కిన సరిపోదా శనివారం మూవీ( Saripodha Sanivaaram ) బాక్సాఫీస్ వద్ద శనివారం వరకు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

గత 24 గంటల్లో ఈ సినిమాకు సంబంధించి ఏకంగా రెండు లక్షల టికెట్లు అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది.

అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేని వర్షాలు సరిపదా శనివారం కలెక్షన్లపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతున్నాయి.

స్కూళ్లకు సైతం సెలవులు ప్రకటిస్తున్న నేపథ్యంలో చాలామంది థియేటర్లలో సినిమా చూడాలని ఉన్నా వెనక్కి తగ్గుతున్నారు.

"""/" / రాష్ట్రంలో వర్షాలు తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడితే మాత్రమే సరిపోదా శనివారం సినిమాకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది.

ఆగస్టు 29వ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదల కాగా పెద్దగా పోటీ లేకుండానే రిలీజ్ కావడం ఈ మూవీకి ప్లస్ అయింది.

ఈ సినిమాలో అటు నాని ఇటు ఎస్.జే సూర్య తమ అభినయంతో అదరగొట్టారనే చెప్పాలి.

ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ఆమె నటనకు సైతం మంచి మార్కులు పడ్డాయి.

గబ్బర్ సింగ్ మూవీ రీ రిలీజ్( GabbarSingh ) అవుతుండటం కూడా సరిపోదా శనివారం కలెక్షన్లపై కొంతమేర ప్రభావం చూపే అవకాశాలు అయితే ఉన్నాయి.

"""/" / సరిపోదా శనివారం సినిమాకు 45 కోట్ల రూపాయల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం 46 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు రావాలి.

వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే సరిపోదా శనివారం మూవీ రేంజ్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి.

సరిపోదా శనివారం మూవీ డిజిటల్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం కాగా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది.

అరుదైన వైద్య అద్భుతం.. రెండుసార్లు పుట్టిన బాబు.. అసలేం జరిగిందంటే?