ఢిల్లీలోని భారత మండపంలోకి వాన నీరు.. కాంగ్రెస్ విమర్శలు

దేశ రాజధాని ఢిల్లీలోని ప్రగతిమైదాన్ వద్ద భారత మండపంలోకి వర్షపు నీరు చేరడంపై విపక్ష పార్టీ కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన డొల్ల అభివృద్ధి ఒక్క వానతో బట్టబయలైందని తెలిపింది.

రూ.2700 కోట్ల వ్యయంతో జీ20 సమ్మిట్ కోసం భారత మండపం కట్టారన్న కాంగ్రెస్ ఒక్క వర్షానికే జలమయం అయిందని ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేసింది.

కాగా భారత్ ప్రభుత్వం ప్రతిష్మాత్మకంగా భారత మండపంలో రెండు రోజులపాటు జీ20 సమ్మిట్ ను నిర్వహించిన సంగతి తెలిసిందే.

అయితే ఇవాళ కురిసిన భారీ వర్షానికి భారత్ మండపంలోకి వర్షపు నీరు చేరింది.

ఢిల్లీ-ఆగ్రా రైలులో డచ్ మహిళను వేధించిన కామాంధుడు.. ఇతనికి సిగ్గు లేదా?