ఆ దేశంలో రోడ్డుపై కరెన్సీ నోట్ల వర్షం.. అసలేం జరిగిందంటే!

సాధారణంగా నీటి బిందువుల వర్షం మనం చూస్తూ ఉంటాం కానీ తాజాగా చిలీలోని హైవేపై కరెన్సీ నోట్ల వర్షం కురిసింది.

పై నుంచి ఏకధాటిగా కరెన్సీ నోట్లు కింద పడుతుంటే హైవేలో వెళ్తున్న పోలీసులు ఒక్కసారిగా స్టన్నయిపోయారు.

అనంతరం తమ వాహనాలు అక్కడికక్కడే వదిలేసి నోట్లను సొంతం చేసుకునేందుకు పరిగెత్తారు.సోషల్ మీడియాలో చిలీలోని హైవేపై డబ్బు వర్షం కురుస్తున్న దృశ్యాలకు సంబంధించి ఒక వీడియో కూడా వైరల్ అయింది.

ఈ నోట్ల వర్షానికి కారణం ఒక జూదం హాలులో జరిగిన దోపిడీ అని పోలీసులు తేల్చారు.

పోలీసుల కథనం ప్రకారం, అక్టోబర్ 21న రాత్రి 7:45 గంటల ప్రాంతంలో చిలీ దేశంలోని పుడహూల్‌లోని ఒక క్యాసినోపై కొందరు దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు.

ఇక్కడ ఉన్న డబ్బును ఎలాగైనా చోరీ చేయాలని ఒకరికొకరు బాగా ఎంకరేజ్ చేసుకున్నారు.

ఆపై ఆ దొంగలు ఓ ఉద్యోగిని తుపాకీతో బెదిరించి, డబ్బును కౌంటర్ మీద పెట్టాలని బలవంతం చేశారు.

దాంతో బాగా భయపడిపోయిన ఆ ఉద్యోగి వెంటనే వారు చెప్పినట్టు డబ్బు మొత్తం బయటికి తీసింది.

ఆ డబ్బునంతా వారు స్వాధీనం చేసుకున్నారు.వెనువెంటనే దుండగులు తమ కారులో పారిపోయేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని వెంబడించడం ప్రారంభించారు.

"""/"/ ఈ చోరులు ఒక సెడాన్‌ కారులో చిలీలోని నార్త్ కోస్టల్ హైవేపైకి దూసుకెళ్లారు.

పోలీసుల దృష్టి మరల్చే ప్రయత్నంలో, దొంగలు వాహనం నుంచి డబ్బు విసిరివేయడం ప్రారంభించారు.

అయితే, మిగతా పోలీసులు వారికి ముందు నుంచి అడ్డంగా వచ్చి ఒక బాక్సులో వారి కారును బలవంతంగా ఎక్కించారు.

అలా కారును ఆపేసి పోలీసులు ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు, వీరందరూ విదేశీ పౌరులే కాగా ఇద్దరు చట్టవిరుద్ధంగా దేశంలో ఉన్నారు.

దొంగలు రోడ్డుపై నోట్లను విసిరేసిన వీడియో వైరల్‌గా మారింది.దానిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌లో నటించిన యంగ్ సెలబ్రిటీలందరూ సక్సెస్.. ఆ ఒక్కరు తప్ప..??