హైదరాబాద్ నగరంలో పలుచోట్ల వర్షం..!

ఎండ వేడిమితో అల్లాడుతున్న భాగ్యనగర ప్రజలకు స్వల్ప ఊరట లభించింది.నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.

ఎల్బీనగర్, హయత్ నగర్, దిల్ సుఖ్ నగర్, జూబ్లీహిల్స్( LB Nagar, Hayat Nagar, Dil Sukh Nagar, Jubilee Hills ), చార్మినార్, ఉప్పల్, శంషాబాద్, సైదాబాద్, నాగోల్ ప్రాంతాల్లో వర్షం కురిసింది.

అదేవిధంగా బాలాపూర్, కార్వాన్, సికింద్రాబాద్, ముషీరాబాద్, రాంనగర్, చిక్కడపల్లిలో వాన పడింది.దీంతో ఉదయం కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు.

కాగా ఈ నెల 22, 23 తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

నా సినిమా ఫంక్షన్లకు మహేష్ అందుకే రాడు.. సుధీర్ బాబు కామెంట్స్ వైరల్!