కల్కి మూవీ షో ఆపేసి టికెట్ డబ్బులు వెనక్కివ్వాలన్న ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే?

హీరో ప్రభాస్( Prabhas ) తాజాగా నటించిన చిత్రం కల్కి.( Kalki ) నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.

ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అన్నిచోట్ల కూడా హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు కలెక్షన్ల సునామీని సృష్టిస్తూ దూసుకుపోతోంది.

ఇకపోతే ఆదివారం రోజున కూడా యధావిధిగా వరల్డ్ వైడ్ గా కల్కి షోస్ పడ్డాయి.

ఇదే క్రమంలో హైదరాబాద్( Hyderabad ) పంజాగుట్టలో ఉన్న పీవీఆర్ లో( PVR ) కూడా షో పడింది.

థియేటర్ హౌస్ ఫుల్ కూడా అయ్యింది. """/" / అందరు కల్కి లో లీనమయ్యారు.

ఆ తర్వాత ఒక్కసారిగా థియేటర్ లో వర్షం( Rain ) స్టార్ట్ అయ్యింది.

దీంతో ఒక్కసారిగా అందరు షాక్ కి గురయ్యారు.చాలా మంది థియేటర్ నుంచి బయటకి వచ్చారు.

కానీ యాజమాన్యం మాత్రం షో ని ఆపకుండా కంటిన్యూ చేసింది.దీంతో షార్ట్ సర్క్యూట్ జరిగి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అంటూ ప్రేక్షకులు గొడవకి దిగారు.

అప్పటికి కూడా యాజమాన్యం షో ని ఆపలేదు.పైగా మీకు ఇష్టముంటే చూడండి లేదా వెళ్లిపోవచ్చంటూ రెక్లెస్ గా సమాధానం ఇచ్చింది.

దీంతో ప్రేక్షకులు పోలీసులకి కంప్లైంట్ చెయ్యడంతో షో ఆగిపోయింది.మా డబ్బులు మాకు ఇవ్వమని ప్రేక్షకులు గొడవ కూడా చేసారు.

"""/" / ఇప్పుడు ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు షోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో హైదరాబాద్ లాంటి మహా నగరంలో అది కూడా పివీఆర్ లాంటి మల్టిప్లెక్స్ లో వర్షం కురవడం ఏంటని మాట్లాడుకుంటున్నారు.

నగరంలో భారీ వర్షాలు కురుస్తుంటే జాగ్రతలు తీసుకోవాలి కదా అని అంటున్నారు.ఇక కల్కి ప్రభంజనం అయితే అన్ని చోట్ల యధావిధిగా కొనసాగుతోంది.

ఇప్పటికే వెయ్యి కోట్ల క్లబ్ లో చేరింది.