తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్…నేడు భారీ వర్షాలు…!

నల్లగొండ జిల్లా:గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో ముసురు కురుస్తోంది.

దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.ప్రాజెక్టులు నిండు కుండగా మారాయి.

అయితే ఇప్పట్లో వర్షాలు తగ్గేలా కనిపించటం లేదు.తెలంగాణలో నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

మరో రెండ్రోజులు పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా హెచ్చరించింది.

ఆదిలాబాద్‌,ఆసిఫాబాద్‌,మంచిర్యాల, నిజామాబాద్,నిర్మల్‌,జగిత్యాల,కరీంనగర్‌,పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు,వరంగల్,హన్మకొండ, జనగాం,ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

ఉరుములు,మెరుపులతో పాటు గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.

పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,అవసరం అయితేనే బయటకు వెళ్లాలని,చెట్ల కిందకు వెళ్లరాదని అధికారులు సూచించారు.

ట్యాక్స్ ట్యాక్స్ పేయర్ల కు ప్రభుత్వం ప్రత్యేక హక్కులు కల్పించాల్సిందే.. కొరటాల శివ డిమాండ్..?