రైల్వేస్ సరికొత్త ఆలోచన.. అక్కడ ఉమ్మితే పెరిగే మొక్కలు..!

ప్రపంచంలోనే భారతీయ రైల్వే వ్యవస్థ అనేది అతి పెద్దిదని అందరికీ తెలుసు.లక్షలాది మంది రోజూ ఈ రైల్వే ద్వారా ప్రయాణాలు సాగిస్తుంటారు.

రైళ్లలో ప్రయాణించే కొందరి చేష్టల వలన రైల్వేకి అనేక సమస్యలు వస్తున్నాయి.బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్న వారి చర్యల వల్ల ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది.

రైల్వేలో చాలామంది ప్రయాణికులు బాధ్యత లేకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటారు.గుట్కాలు, పాన్ లు, పొగాకు నమిలి ట్రైన్లలో ఎక్కడబడితే అక్కడ ఉమ్మేస్తుంటారు.

వారు చేసే ఆ పని వల్ల రైళ్లు, రైల్వే స్టేషన్ల ప్రాంతాల్లో మరకలు అనేవి ఏర్పడతాయి.

అటువంటి తప్పులను ప్రయాణికులు చేయకుండా రైల్వే శాఖ కొన్ని చర్యలు తీసుకుంది.ఎవరైనా సరే రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో ఉమ్మి వేస్తే రూ.

500 లు జరిమానా వేయాలని రైల్వే తెలుపుతోంది.అయినా చాలా మంది మార్పు రావడం లేదు.

కొందరు వ్యక్తులు నిర్లక్ష్యంగా ఉమ్మేయడంతో మరకలు తొలగించేందుకు రైల్వే శాఖ భారీగానే ఖర్చు చేస్తోంది.

ఇందుకోసం భారీ మొత్తంలో ఖర్చు అవుతోంది.దాదాపుగా 12 వేల కోట్లతో రైల్వే శాఖ ఆ మరకలను తొలగించడానికి ఖర్చు చేస్తోంది.

పశ్చిమ, ఉత్తర, సెంట్రల్ రైల్వేలకు చెందినటువంటి 42 స్టేషన్లలో రైల్వే సరికొత్త విధానాన్ని తీసుకురానుంది.

"""/"// నాగ్‌పూర్‌ కు చెందినటువంటి ఈజీస్పిట్‌ అనే స్టార్టప్ కంపెనీతో రైల్వే ఓ అగ్రిమెంట్ కుదుర్చుకుంది.

ఆ అగ్రిమెంట్ ప్రకారంగా వెస్టర్న్, నార్తర్న్, సెంట్రల్ రైల్వే బోర్డులకు చెందినటువంటి మొత్తం 42 రైల్వే స్టేషన్లలో వెండింగ్ మెషీన్లను ఏర్పాటు చేస్తోంది.

ఆ రైల్వే స్టేషన్లలో రూ.5 నుంచి రూ.

10కు ఒక పౌచ్ అమ్మేలా ప్లాన్ చేస్తున్నారు.ప్రయాణికులు వాటిని కొనుక్కుని జేబులో పెట్టుకోవాల్సి ఉంటుంది.

ఒకవేళ వారు ఉమ్మాల్సి వస్తే ఆ పౌచ్ లోనే ఉమ్మాలి.వాటిలో కనీసంగా 10 నుంచి 15 సార్లు ఉమ్మేయవచ్చు.

ఇటువంటి పౌచ్ ల వల్ల పర్యావరణానికి ఎటువంటి కీడూ జరగదు.పౌచ్ లో ఉమ్మిన తర్వాత దాని నుంచి బ్యాక్టీరియా బయటకు రాకుండా టెక్నాలజీ ఉపయోగించారు.

ఉమ్మిన పౌచ్ ను బయటపడేస్తే పౌచ్ లోని గింజలు ఉమ్మిలోని పోషకాలను వినియోగించుకుని మొక్కలుగా పెరుగుతాయి.

ఎన్టీఆర్, విశ్వనాథ్ మధ్య గొడవ ఏంటి ? 20 ఏళ్లు ఎందుకు మాట్లాడుకోలేదు ?