షాకింగ్: అప్పు తిరిగివ్వమన్న సహోద్యోగిపై యాసిడ్ దాడి.. మెడపై కత్తితో పొడిచి హత్య…
TeluguStop.com

రోజురోజుకీ మనుషులు మరింత క్రూరంగా మారుతున్నారు.చిన్న కారణాలకే ఇతరులను చంపేసి కటకటాల పాలవుతున్నారు.


తాజాగా రైల్వే స్టేషన్లో పనిచేసే ఓ వ్యక్తి తనతో పాటు పని చేస్తున్న మహిళను అత్యంత దారుణంగా హత్య చేశాడు.


ఆమె మెడపై పలుమార్లు కత్తితో పొడిచి, ఆపై ముఖం, శరీరంపై యాసిడ్ పోశాడు.
ఆమె ఎవరో ఎవరికీ తెలియకూడదని అతను ఇలా చేసాడు. """/"/
ఈ నేరం చేసిన నిందితుడు పేరు మహ్మద్ జాకీర్.
ఇతను రైల్వే స్టేషన్ టెక్నీషియన్( Railway Station Tecnician ).ఈ కిరాతకుడికి బాధితురాలు 2018, 2019లో రూ.
11 లక్షలు అప్పుగా( Debt ) ఇచ్చింది.ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని అడిగింది.
దానికే అతడు ఆమెను చంపేశాడు.శనివారం గ్రేటర్ నోయిడా( Greater Noida )లోని సెక్టార్ 148 మెట్రో స్టేషన్ సమీపంలో బాధితురాలి మృతదేహం లభ్యమైంది.
సెప్టెంబరు 8న ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె కుమార్తె సెప్టెంబర్ 9న అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేసింది.
నిందితుడు మహ్మద్ జాకీర్ను పోలీసులు 20 గంటలపాటు వెతికి పట్టుకున్నారు.డబ్బులు తిరిగివ్వాలని ఒత్తిడి చేయడం వల్లే హత్య చేశానని పోలీసులకు తెలిపాడు.
"""/"/
ఆమెను నోయిడాలోని నాలెడ్జ్ పార్క్కు తీసుకెళ్లి ఇనుప డాగర్తో హత్య చేశాడు.
ఆ తర్వాత ఆమె గుర్తింపును దాచేందుకు ఆమె ముఖం, శరీరంపై యాసిడ్ పోశాడు.
నోయిడాలోని సెక్టార్ 148 వద్ద విద్యుత్ స్తంభం పొదల్లో ఆయుధాన్ని, యాసిడ్ను దాచిపెట్టాడు.
నిందితుడిపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.45 ఏళ్ల బాధితురాలు రైల్వే స్టేషన్లో క్లర్క్గా పనిచేస్తుంది.
నిందితుడు అదే రైల్వే స్టేషన్లో టెక్నీషియన్గా ఉన్నాడు.అలా వారిరువురికీ పరిచయం ఏర్పడింది.
అయితే ఈ సంఘటన స్థానికంగా ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది.
వైరల్: బర్త్ డే కేక్‌లో బాంబు.. ఘోరం ఇదే?