భాజాపాది పిరికి భావజాలం అంటున్న కాంగ్రెస్ యువరాజు
TeluguStop.com
ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్( ఐ ఓ సి) ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీపై విమర్శలు చేశారు.
ఒక వ్యక్తిని పదిమంది కలిపి కొడితే ఆనందపడే పిరికి మనస్తత్వం భాజాపాపార్టీది .
అందుకే ఆ పార్టీ ఎప్పుడూ మూక దాడులను ప్రోత్సహిస్తుందని తెలిపారు.సావర్కర్ ది కూడా ఇదే భావజాలం అని, ఈరోజు నా నలుగురు స్నేహితులతో కలిసి ఒక ముస్లిం వ్యక్తిని కొట్టాను నాకు ఎంతో ఆనందంగా ఉంది అని సావర్కర్ తన పుస్తకంలో రాసుకున్నారని చెప్పారు .
చైనా ఆర్థిక వ్యవస్థ మనకంటే పెద్దది కాబట్టి పోరాటం మంచిది కాదని భారతదేశానికి శాఖ మంత్రి చెబుతున్నారని, మరి బ్రిటిష్ వారు కూడా మనకంటే బలమైన వారే కదా అని స్వతంత్ర పోరాటం మానేశామా? స్వతంత్ర పోరాట సమయంలో బిజెపి ఉండి ఉంటే మనకు స్వాతంత్రం కూడా వచ్చేది కాదేమో అని విమర్శించారు """/" / పార్లమెంట్లో ఎంపీలు మాట్లాడుతున్న సమయంలో ఎక్కడ నిజాలు బయట పెడతారేమో అని మా మైకులను పనిచేయకుండా చేస్తారని ఈ పరిస్థితిని నేను మాట్లాడుతున్న సమయంలో చాలాసార్లు ఎదుర్కొన్నానని బ్రిటిష్ పార్లమెంట్ ని ఉద్దేశించి మాట్లాడుతున్న సందర్భంగా ఆయన తెలిపారు .
నోట్ల రద్దు వంటి అత్యంత వినాశకర నిర్ణయాలపై చర్చించేందుకు మాకు పార్లమెంట్లో సమయం ఇవ్వలేదని, జీఎస్టీ పై కూడా ఇదే పరిస్థితి ఎదురైందని ఆయన తెలిపారు, ఒకప్పుడు భారత పార్లమెంట్ శక్తివంతమైన చర్చలకు వేడి పుట్టించే వాదనలకు భిన్నాభిప్రాయాలకు వేదికగా ఉండేదని ఇప్పుడు మేము ఆ పార్లమెంటును మిస్ అవుతున్నామని ఆయన తెలిపారు.
కేవలం వారికి అవసరమైన విషయాల్లో చర్చించేందుకు మాత్రమే మేము పార్లమెంట్లో ఉండాలని అదే గందరగోళం ఇప్పటికీ కొనసాగుతుందని ఆయన తెలిపారు """/" /
భారతదేశం వెలుపల రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి విదేశాల్లో భారత పరువుని ను తీసే విధంగా ఇటువంటి వ్యాఖ్యలు చేయటం సరికాదని కొంతమంది అంటుంటే, రాహుల్ నిజమే చెప్పారని ఇప్పటికైనా పరిస్థితులు మారాలని కొంతమంది సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు .
ఆ డైరెక్టర్ డైరెక్షన్ లో నటించాలని ఆశ పడుతున్న రిషబ్ శెట్టి.. కోరిక తీరుతుందా?