పంజాబ్ ను వదిలేయనున్న రాహుల్ .?!

ఐపిఎల్ 2021 ఇంకా ముగియనేలేదు.అప్పుడే ఐపిఎల్ 2022 మీద అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.

దీనికి కారణం మెగా ఆక్షన్.అంటే వచ్చే ఐపిఎల్ సీసన్ ఇంకా ఆసక్తికరంగా మారనుంది.

అయితే ఇప్పుడు అందరి కళ్ళు పంజాబ్ కింగ్స్ మీదనే ఉన్నాయని చెప్పొచ్చు.ఎందుకంటే వచ్చే సీసన్ లో కెప్టెన్ కేఎల్.

రాహుల్ పంజాబ్ కి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నాడని సమాచారం.పంజాబ్ కింగ్స్ విజయాల్లో రాహుల్ ది ప్రత్యేక పాత్ర ఉంది.

ఐపిఎల్ 2021 సీజన్ లో 13 గేమ్స్ ఆడిన రాహుల్ 626 పరుగులు చేసాడు.

ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు.టీం మొత్తం పరుగులు చేయడానికి ఇబ్బందిపడితే రాహుల్ మాత్రం 140 పరుగుల ఛేదనలో 98 పరుగులు చేసి శభాష్ అనిపించుకున్నాడు.

అయితే ఇప్పుడు రాహుల్ పంజాబ్ జట్టులో ఉండేందుకు అనాసక్తిగా ఉన్నాడని టాక్ నడుస్తోంది.

పంజాబ్ కు బై చెప్పి వేలంలోకి రావాలని చూస్తున్నాడట.వచ్చే సీజన్ నుంచి మొత్తం 10 జట్లు లీగ్‌ లో పాల్గొననున్నాయి.

అంతకు ముందే మెగా వేలం నిర్వహించబోతున్నారు.ఈ సారి కేవలం ఇద్దరు లేద ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం బీసీసీఐ కల్పిస్తున్నది.

దీంతో ఆయా ఫ్రాంచైజీలు ఎవరెవరిని జట్టుతో పాటు ఉంచుకోవాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నాయి.

పంజాబ్ లో రాహుల్ ఉండనని ముందే చెప్పేయడంతో ఆసక్తి నెలకొంది.పంజాబ్ యాజమాన్యం ఇంకా దీనిపై క్లారిటీ ఇవ్వలేదు.

"""/"/ అయితే రాహుల్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు వెళ్తాడనే వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

ఆర్సిబి కి కెప్టెన్ గా కోహ్లీ వచ్చే ఏడాది ఉండడని కోహ్లీ ముందే చెప్పేయడంతో బెంగళూరు రాహుల్ ని తీసుకుంటే బాగుంటుందని, అప్పుడు బెంగళూరుకు ఒక స్ట్రాంగ్ ఇండియన్ ప్లేయర్ కూడా యాడ్ అవుతాడని బెంగళూరు కూడా అనుకుంటుంది సమాచారం.

అయితే వీటిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

రిపోర్టింగ్ చేస్తూ నదిలో పడిపోయిన టీవీ జర్నలిస్టు.. చివరికి..?