కరోనా వాక్సిన్ విషయంలో ప్రభుత్వ తీరు ఆందోళనకరం : రాహుల్

కాంగ్రెస్ యువ నాయకుడు రాహుల్ గాంధీ దేశ ప్రధాని కావాలని కలలు కంటున్నారు.

మరి అలాంటి రాహుల్ గాంధీ ప్రభుత్వ తీరును ప్రతి విషయంలో తప్పు పట్టడం మంచిదే.

వారు చేస్తుంది సరైన ధోరణి కాదు అని విమర్శించడం మంచిదే.కాని వాళ్ళను మనం విమర్శిస్తున్నప్పుడు మేము ప్రపోజ్ చేస్తున్న ప్రణాళిక ఇది మరి మీరు అమలు చేయాలనుకుంటున్న ప్రణాళిక ఏదో బయటపెట్టండి.

ఇందులో ఎవరి ప్రణాళికకు ఎంత దూరదృష్టి ఉందో ప్రజలకు అర్థమవుతుంది.దూరదృష్టి ఉన్నవారికి ప్రజలు ఎన్నికలలో పట్టం కడతారు అంటూ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తే బాగుంటుందని విశ్లేషకలు అభిప్రాయపడుతున్నారు.

కానీ వీటిని అసలు పట్టించుకోని రాహుల్ గాంధీ ప్రభుత్వంపై అస్తమానం మండి పడుతూ ఆయన చెప్పింది జరిగితే నేను చెప్పిందే జరిగింది చూశారుగా నాకు ఎంత దూర దృష్టి ఉందో అని తనని తాను ప్రొజెక్ట్ చేసుకుంటారు.

తాజాగా రాహుల్ గాంధీ భారత్‌లో లక్షల ప్రజలు కరోనా బారినపడి సతమమవుతున్నారు.

'కరోనా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసే దేశాలలో భారత్ కూడా ఒకటి.మరి అలాంటి టైంలో వ్యాక్సిన్‌ కు సంబంధించి ప్రభుత్వం చేస్తున్న జాప్యం చాలా ఆందోళన కలిగిస్తుంది.

ఇప్పటికైనా ప్రభుత్వం ఎప్పటిలోగా వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తుందో, దాని ధర ఎంతో, ఆ వాక్సిన్ పంపిణీ విధి విధానాలు ఏంటో అనే అంశాలపై ఓ స్పష్టతకు వచ్చిందా లేదా అంటూ ట్వీట్ చేశారు.

చిరంజీవి హిట్ సినిమాను రీమేక్ చేస్తున్న స్టార్ హీరో…