తెలంగాణలో రాహుల్ పాదయాత్ర రూట్ మ్యాప్ ఖరారు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించనుంది.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పాదయాత్ర రూట్ మ్యామ్ ఖరారు అయింది.తెలంగాణలో మొత్తం 375 కిలో మీటర్లు మేర రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది.

ఈ మేరకు రూట్ మ్యాప్ ను తెలంగాణ కాంగ్రెస్ విడుదల చేసింది.ఈనెల 23న రాష్ట్రంలోకి భారత్ జోడో యాత్ర ప్రవేశించనుంది.

కర్ణాటక నుంచి కృష్ణానది బ్రిడ్జి మీదుగా మహబూబ్ నగర్ లోని మక్తల్ నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించనుంది.

అదేవిధంగా ఈనెల 31న హైదరాబాద్ లోకి యాత్ర ప్రవేశిస్తుందని కాంగ్రెస్ నేతలు తెలిపారు.

బన్నీ అరెస్ట్ తర్వాత స్నేహారెడ్డి తొలి పోస్ట్ వైరల్.. ఈ పోస్ట్ లో ఏం చెప్పారంటే?