కేంద్రంపై రాహుల్ గాంధీ సీరియస్ వ్యాఖ్యలు..!!

కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

యూపీఏ హయాంలో క్రూడాయిల్ ధర $110 ఉండేది.కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధర.

74 డాలర్లే.అంతర్జాతీయ పరంగా చమురు ధరలు తగ్గినా కానీ దేశంలో పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గడం లేదు అని రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం పై సీరియస్ అయ్యారు.

ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఏడు సంవత్సరాల నుండి గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు పెంచుకుంటూ దాదాపు ఈ విషయంలో 23 లక్షల కోట్లు సంపాదించింది.

వచ్చిన ఈ డబ్బంతా సర్కారు ఎటు వైపు మళ్లిస్తుంది అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

2014 నుండి గ్యాస్ ధర 116 శాతం దేశంలో పెరిగిందని.ఈ విధంగా పెంచుకుంటూ పోతూ దేశంలో ప్రతి సామాన్యుడి పై కేంద్రం భారం వేస్తోంది అని మండిపడ్డారు.

జి.డి.

పి వృద్ధి అంటే గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడమే అన్నట్టు కేంద్రం యొక్క నిర్ణయాలు ఉన్నాయని రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు.

గత ఏడు సంవత్సరాల నుండి గ్యాస్, డీజిల్, పెట్రోల్.ద్వారా కేంద్రం 23 లక్షల కోట్లు సంపాదించి ఉందని ఆ డబ్బంతా ఏమైంది అని.

గట్టిగా నిలదీశారు.

జయం మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ హీరో నిఖిల్ కాదు.. మరి ఎవరో తెలుసా ?