అనర్హత వేటుపై రాహుల్ గాంధీ రియాక్షన్

అనర్హత వేటుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు.అదానీ, మోదీ మధ్య సంబంధం కొత్తది కాదన్నారు.

మోదీ గుజరాత్ సీఎం ఉన్నప్పటి నుంచే వారి మధ్య బంధం కొనసాగుతోందని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో వారి మధ్య ఉన్న బంధం గురించే తాను ప్రశ్నించానని రాహుల్ గాంధీ తెలిపారు.

అదానీకి అడ్డదారిలో ఎయిర్ పోర్టులు కట్టబెట్టడంపైనే స్పందించానన్నారు.ఈ క్రమంలోనే స్పీకర్ కు సవివరంగా పూర్తి వివరాలతో ఒక నోట్ ఇచ్చానని చెప్పారు.

ఒక సభ్యుడు నోట్ ఇస్తే స్పీకర్ మాట్లాడే అవకాశం ఇవ్వాలన్నారు.అదానీ షెల్ కంపెనీలలో రూ.

30 వేల కోట్లు గుర్తు తెలియని వ్యక్తులు పెట్టుబడులు పెట్టారని తెలిపారు.

వైసీపీకి మరో కీలక నేత రాజీనామా .. జగన్ రియాక్షన్ ఏంటో ?