రాహుల్ గాంధీవి జూటా మాటలు..: మంత్రి హరీశ్ రావు

కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు.రాహుల్ గాంధీ కుట్ర పూరితంగా విషం చిమ్ముతున్నారన్నారు.

ఓటుకు నోటుతో అడ్డంగా దొరికిన వ్యక్తిని పక్కన పెట్టుకొని అవినీతిపై రాహుల్ గాంధీ మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

తల్లిని తిట్టిన వ్యక్తిని పీసీసీ చీఫ్ ను చేశారన్న మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ కు 40 నుంచి 45 స్థానాలకు అభ్యర్థులు లేక పక్క పార్టీల వైపు చూస్తోందన్నారు.

రాహుల్ గాంధీ జూటా మాటలు మాట్లాడుతున్నారని తెలిపారు.రాహుల్ తన పేరును రాంగ్ గాంధీ అని పెట్టుకోవాలని సూచించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారని ఎద్దేవా చేశారు.

లోకో-పైలట్‌ ప్రేమలో యూకే మహిళ.. దీని వెనుక హార్ట్‌టచింగ్ స్టోరీ..?