రాహుల్ గాంధీ కుటుంబం భారతదేశ ప్రజల కోసం ప్రాణ త్యాగాలు చేసింది

రాజన్న సిరిసిల్ల జిల్లా :రాహుల్ గాంధీ( Rahul Gandhi ) కుటుంబం భారతదేశ ప్రజల కోసం ప్రాణ త్యాగం చేసిన కుటుంబం పలువురికి ఆదర్శమని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య , ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి లు అన్నారు.

ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాత బస్టాండులో, ఎల్లారెడ్డిపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెన్ని బాబు , జిల్లా ఉపాధ్యక్షులు పందిళ్ళ లింగం గౌడ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ వద్ద, రాచర్ల గొళ్ళపల్లి బస్టాండ్ లో మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు సాహెబ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి వాటీ ఎదుట వారు కేక్ లు కట్ చేసి బుధవారము రాహుల్ గాంధీ జన్మదినం వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

రాహుల్ గాంధీ నిండు నూరేళ్లు మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని ప్రజలకు ఇంకా మరిన్ని సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి మాట్లాడుతూ యువ నేత రాహుల్ గాంధీ భారతదేశ ప్రజలకు ఇంకా సేవలు అందించాలని వారి కుటుంబ సేవలు భారతదేశ ప్రజలకు అవసరమన్నారు.

అనంతరం బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ రాహుల్ గాంధీ బావి భారత ప్రధాని అవుతారనీ ఆయన అభిప్రాయపడ్డారు.

పేద ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి 6 వేల కిలోమీటర్లు కాలినడకన ఐమత్యం , సమానత్వం , న్యాయం, గాంధీ చెప్పిన మార్గంలో నడుస్తూ భారత్ జూడో యాత్రను కొనసాగించారనీ , గాంధీజీ చెప్పిన సందేశాన్ని భారత్ జూడో యాత్రలో ప్రచారం చేసిన ధైర్యశాలి రాహుల్ గాంధీ అన్నారు.

రానున్న కాలంలో ప్రతిపక్షాలకు దీటుగా పనిచేస్తున్నారని భారతదేశానికి ప్రధానమంత్రి( Prime Minister ) అయ్యే అవకాశం ఒక్క రాహుల్ గాంధీకే ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ , మేడిపల్లి దేవానందం , కిసాన్ సెల్ జిల్లా అద్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షులు బానోత్ రాజు నాయక్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు సూడిద రాజేందర్, బిసి సెల్ అధ్యక్షులు రవి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు రఫిక్, మహిళా మండల అధ్యక్షురాలు ఆకుల లత , కిసాన్ సెల్ మండల అధ్యక్షులు గుండాడి రాంరెడ్డి , కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రపు రాములు, మాజీ ఎంపీటీసీ సభ్యులు నేవూరి రవీందర్ రెడ్డి , బండారి బాల్ రెడ్డి , నంది కిషన్ , సిరిపురం మహేందర్ , గంట బుచ్చాగౌడు ,దండు శ్రీనివాస్ , అంతేర్పుల గోపాల్, పొన్నాల మల్లారెడ్డి,గొల్లపల్లి మల్లేశం, మెండే శ్రీనివాస్ యాదవ్ , బుచ్చిలింగి సంతోష్ గౌడ్ , అగ్రహారం కిషన్ , గంట కార్తీక్ గౌడ్ .

పందిళ్ళ శ్రీనివాస్ గౌడ్, బురక ధర్మేందర్ ,పుల్లయ్య గారి తిరుపతి గౌడ్ , గంట దేవయ్య గౌడ్ , పందిర్ల సుధాకర్ గౌడ్ , గంట ఆంజనేయులు గౌడ్ , ద్యాగం లక్ష్మి నారాయణ, గన్న మల్లారెడ్డి ,గంట వెంకటేష్ గౌడ్ , వడ్నాల దేవయ్య, పొన్నాల తిరుపతి రెడ్డి , దోమ్మాటి రాజు గన్న శ్రీనివాస్ రెడ్డి , భాస్కర్ జాదవ్ సోషల్ మీడియా ప్రతినిధి బిపేట రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఆ హామీతో … కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి మంత్రి పదవి  ?