గంభీరావుపేటలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: రాహుల్ గాంధీ( Rahul Gandhi ) 54వ జన్మదిన వేడుకలను గంభీరావుపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా గంభీరావుపేట( Gambhiraopet ) గాంధీ చౌక్ వద్ద పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేసి,కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్ మాట్లాడుతూ గంభీరావుపేట మండల ప్రజల పక్షాన,కాంగ్రెస్ పార్టీ నాయకుల,కార్యకర్తల పక్షాన రాహుల్ గాంధీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ప్రస్తుతం దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రజా నాయకుడు రాహుల్ గాంధీ అని భారజోడో యాత్ర ద్వారా దేశంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల సమస్యలను తెలుసుకుని అదేవిధంగా కులాల పేరు మీద మతాల పేరు మీద భారతదేశాన్ని విభజించి పాలిస్తున్న బిజెపి( BJP ) ప్రభుత్వాన్ని ప్రజల్లో ఎండగడుతూ ప్రజా విద్యార్థి కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా నిష్క్రమించబోమని ఈ దేశ ఐక్యత కోసం తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండా సుమారు నాలుగువేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన ఘనత రాహుల్ గాంధీ దని కొనియాడారు.

రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలోకి రావడం తధ్యమని,రాహుల్ గాంధీ ని ప్రధాని చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పరుశురాములు,మండల యూత్ కాంగ్రెస్ నాయకులు గంగి స్వామి, ఎగదండి మహేష్, మహమ్మద్ ఇస్మాయిల్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏడబోయిన ప్రభాకర్, రాజబోయిన లచ్చయ్య, శ్రీనివాస్, మొహమ్మద్, యాదుల్లా, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు పంతం సురేష్,వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు పాపా గారి రాజు గౌడ్, ఓరుగంటి నరసింహులు,మేడ భాస్కర్ మహేందర్,మైనారిటీ నాయకులు మహమ్మద్ తాహెర్,మహమ్మద్ అప్సర్ తదితరులు పాల్గొన్నారు.

వీడియో వైరల్: ఫోన్ ఇవ్వనందుకు తల్లిని బ్యాట్ తో చావబాదిన కొడుకు!