మరోసారి కరోనా వ్యాప్తి పై మాట్లాడిన రాహుల్….20 లక్షలకు చేరుకుంటాయంటూ…
TeluguStop.com
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం విదితమే.దేశంలో కూడా ఈ వైరస్ వ్యాప్తి విపరీతంగా పెరిగిపోతుండటం తో పలు రాష్ట్రాలు మరోసారి లాక్ డౌన్ విధిస్తూ చర్యలు చేపట్టాయి.
ఈ క్రమంలోనే దేశంలో కరోనా వ్యాప్తి పై తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు.
ప్రస్తుత స్థితిలో దేశంలో కరోనా కేసులు 10 లక్షలు దాటాయని ఇలాగె కొనసాగితే ఆగస్టు నాటికి ఈ కేసుల సంఖ్య 20 లక్షలకు చేరుకుంటుంది అని ఆయన జోస్యం చెప్పారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా కేసుల స్థాయి 10 లక్షల మార్క్ దాటిన విషయం విదితమే.
రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య అత్యధిక స్థాయిలో నమోదు అవుతుండడం తో ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రతి రోజూ కూడా దాదాపు 30 వేల వరకు కేసులు నమోదు అవుతున్నాయి.
రోజు రోజుకు ఈ సంఖ్య పెరుగుతుందే కానీ తగ్గడం లేదు.మొదట్లో పదివేల కేసులు నమోదు అవుతుండగా ఆ తరువాత ఈ సంఖ్య 20 వేలకు,ఇప్పుడు ఏకంగా 30 వేలకు పెరుగుతూ వచ్చింది.
ఇదే వేగంలో గనుక కరోనా కేసులు నమోదు అయితే నిజంగా ఈ కేసుల సంఖ్య 20 లక్షల కు చేరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదే విషయాన్నీ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వెల్లడించారు.గతంలో కూడా ఒకసారి కరోనా వ్యాప్తి పై రాహుల్ మాట్లాడారు.
జులై 14 నాటికి పది లక్షల మార్క్‌కు చేరుకుంటామని ఆ సమయంలో తాను చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గుర్తు చేశారు.
మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ పై కూడా రాహుల్ మండిపడ్డారు. """/"/
ప్రధానమంత్రి మోడీ వరుసగా చేస్తున్న తప్పులు దేశాన్ని బలహీనపరుస్తున్నాయని రాహుల్ గాంధీ విమర్శించారు.
చైనాకు భారత్ సైనికులపై దాడి చేసే ధైర్యం ఇన్నేళ్లుగా లేనిది ఇప్పుడు ఎలా వచ్చిందంటూ ఆయన ప్రశ్నించారు.