టి కాంగ్రెస్ పై ఏఐసిసి స్పెషల్ ఫోకస్ ? రాహుల్ అసంతృప్తి

తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి పై ఆ పార్టీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టింది.

ఎప్పటికప్పుడు ఇక్కడ చోటు చేసుకుంటున్న పరిణామాల పై నివేదికలు తెప్పించుకుని నాయకులకు దిశానిర్దేశం చేస్తోంది.

ముఖ్యంగా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గాల్లో పరిస్థితి ఏమిటి ?  నాయకులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా లేక ఇంకా అక్కడ ప్రజలు ఏ ఏ విషయాలపై అసంతృప్తి తో ఉన్నారు ? ఇలా అనేక అంశాలపై ఎప్పటికప్పుడు తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కానుగోలు ద్వారా నివేదికలను తెప్పించుకుంటూ అక్కడి పరిస్థితిని మార్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ప్రస్తుతం సునీల్ అందిస్తున్న నివేదికలను సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి వేణుగోపాల్ రాహుల్ దృష్టికి వెళ్తున్నట్లు సమాచారం.

అయితే తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి పై రాహుల్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం .

ముఖ్యంగా వరంగల్ సభలో ప్రకటించిన రైతు డిక్లరేషన్ ప్రజల్లోకి తీసుకు వెళ్లడం లో  టీ కాంగ్రెస్ నేతలు వెనకబడ్డారు అనే అభిప్రాయం రాహుల్ లో ఉందట.

అలాగే నెల రోజుల పాటు పల్లెపల్లెకు కాంగ్రెస్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా రైతు రచ్చబండ కార్యక్రమం నిర్వహించే విధంగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించడంతో పాటు, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏమేం చేస్తోందనే విషయాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని నిర్ణయించింది.

రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమంపై నియోజకవర్గాల వారీగా వివరాలు రాజకీయ వ్యూహకర్త సునీల్  ఎప్పటికప్పుడు ఏఐసీసీ పెద్దలకు పంపించారు.

  """/" / అయితే ఈ నివేదికలను చూసిన తర్వాత రాహుల్ ఈ రచ్చబండ కార్యక్రమం నిర్వహణ పై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఈ మేరకు రేవంత్ రెడ్డి సైతం క్లాస్ పీకడం తో నిన్న గాంధీభవన్ లో జరిగిన టిపిసిసి ముఖ్యనేతల సమావేశం లో రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.

నాయకులు పనిచేయకపోతే పదవులు ఇచ్చేదే లేదని, గాంధీభవన్ చుట్టూ తిరిగితే పదవులు రావని గ్రామాల్లో తిరగాలని, ప్రజల్లో తిరుగుతూ పట్టు పెంచుకునే వారికి పార్టీలో టికెట్లు కేటాయిస్తామని, పనిచేసే నాయకులకే పదవులు ఇస్తామని ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్లు సమాచారం.

నా ఉసురు తగిలి ఈ సినిమా కూడా పోతుంది.. రాజ్ తరుణ్ లవర్ షాకింగ్ కామెంట్స్!