Rahul Gandhi : భారత్ ప్రజాస్వామ్య దేశమన్నది అతిపెద్ద అబద్ధం..: రాహుల్ గాంధీ
TeluguStop.com
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ( Congress Leader Rahul Gandhi ) కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత్ పెద్ద ప్రజాస్వామ్య దేశమన్నది అతి పెద్ద అబద్ధమని ఆయన అన్నారు.దేశంలో ఇప్పుడు ప్రజాస్వామ్యమే లేదని తెలిపారు.
కాంగ్రెస్ బ్యాంకు అకౌంట్లు( Congress Bank Accounts ) అన్నింటినీ స్తంభింపజేశారని రాహుల్ గాంధీ మండిపడ్డారు.
ఇది ప్రధాని నరేంద్ర మోదీ( PM Narendra Modi ) నేరపూరితమైన చర్యని ఆరోపించారు.
తమ అకౌంట్లను స్తంభింపజేయడం వలన ఎన్నికల ప్రచారం చేసుకోలేకపోతున్నామని తెలిపారు.అంతేకాకుండా కార్యకర్తలకు, అభ్యర్థులకు సపోర్ట్ చేయలేకపోతున్నామని పేర్కొన్నారు.
దేశంలో ఇరవై శాతం ఓట్లు కాంగ్రెస్ కు ఉన్నాయన్న రాహుల్ గాంధీ రూ.
2 కూడా దేనికీ చెల్లించే స్థితిలో లేమని వెల్లడించారు.ఇది కాంగ్రెస్ అకౌంట్లను ఫ్రీజ్ చేయడం కాదని, భారత ప్రజాస్వామ్యాన్ని స్తంభింపచేయడమని తెలిపారు.
మహా కుంభమేళాలో హల్చల్ చేసిన నకిలీ షేక్.. ఉతికారేసిన సాధువులు