కాంగ్రెస్ తుక్కుగూడ ‘జనజాతర’ సభలో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..!!
TeluguStop.com
హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో( Thukkuguda ) కాంగ్రెస్ జనజాతర సభ( Congress Jana Jatara ) జరిగింది.
ఈ సభలో రాహుల్ గాంధీ( Rahul Gandhi ) జాతీయ మేనిఫెస్టోను విడుదల చేశారు.
తెలంగాణకు ప్రత్యేకంగా 23 హామీలను ప్రకటించడం జరిగింది.తాము అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన గ్యారెంటీలను నెరవేరుస్తున్నట్లు పేర్కొన్నారు.
దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్న తరుణంలో తెలంగాణలో ఇప్పటికే 30 వేల ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది.
మరో 50 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం.తెలంగాణలో మాట ఇచ్చి నిలబెట్టుకున్నట్లే జాతీయస్థాయిలో మాట నిలబెట్టుకుంటాం.
ప్రతి ఏడాది పేద మహిళలకు లక్ష రూపాయలు నేరుగా బ్యాంకులో వేస్తామని హామీ ఇచ్చారు.
యువతకి ఏడాదికి లక్ష రూపాయలు వచ్చేలా ఉపాధి కల్పిస్తాం. """/" /
విద్యావంతులైన యువకులకు నెలకు 8,500 రూపాయలు ఇస్తూ.
శిక్షణ ఇప్పిస్తాం.ఇకపై దేశంలో ఏ కుటుంబానికి ఏటా లక్ష రూపాయల కంటే తక్కువ ఆదాయం ఉండదు.
మోదీ ప్రభుత్వం ధనవంతులకే 16 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది.రైతులకు( Farmers ) ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు.
అని రాహుల్ గాంధీ సంచలన స్పీచ్ ఇచ్చారు.తెలంగాణలో బీజేపీ బీ టీం ఓడించినట్లు వచ్చే ఎన్నికలలో మోదీని( Modi ) ఓడిస్తామని రాహుల్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ఖాతాలను బీజేపీ నిలిపివేసింది.మోదీ దగ్గర ధనం, ఈడీ, సిబిఐ, ఐటీ ఉంటే మాకు ప్రజల ప్రేమ తోడుగా ఉంది.
ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం ఎలక్టోరల్ బాండ్స్, ముందు సిబిఐ బెదిరిస్తుంది.వెంటనే ఆ కంపెనీ బాండ్లు కొంటుంది.
రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ యోచిస్తోంది.మేము రద్దు కానివ్వం అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
మహేష్ బాబు రాజమౌళి సినిమాలో ఇది హైలెట్ అవ్వబోతుందా..?