మోడి అసమర్ధ ప్రధాని

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ, భారత ప్రదాని నరేంద్ర మోడీ పై విలేకరుల సమావేశంలో తన మాటలతో విరుచుకు పడ్డాడు.

దేశం ఓ అసమర్థుడి చేతిలో ఉంది అన్నారు.ఒక్కరు ఇద్దరు పెట్టు బడుదారుల కోసమే ఈ నూతన వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చాడని అన్నాడు.

ఈ చట్టాలు రైతులకు పూర్తిగా వ్యతిరేకమైనవి .వెంటనే పార్లమెంట్ సంయుక్త సమావేశాలు ప్రారంభించి వాటిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాడు.

కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రైతుల పక్షాన పోరాడే పార్టీ అన్నాడు.కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు రైతులు ఆందోళనను విరమించరని అన్నాడు.

రైతుల తరుపున 2 కోట్ల సంతకాలు సేకరించిన వినతి పత్రాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ కు అందించాడు.

నోరెత్తి గట్టిగా మాట్లాడే రైతులపై, కార్మికులపై ఉగ్రవాదులుగా ముద్రవేస్తున్నాడు అన్నాడు .అప్పుడు కరోనా సమయంలో భారత్ కు ముప్పు పొంచి ఉందని హెచ్చరించిన ప్రదాని పట్టించుకోలేదు అన్నాడు.

దేశంలో రైతులు అప్పుల బాదలతో, వర్షాలకు పంటలు దెబ్బతిని పెట్టిన పంటకు పెట్టుబడుల మందం కూడా ఆదాయం రాక ఇబ్బందులు పడుతూ ఉంటే కొత్తగా వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి వారిని ఇంకా హింసించడమే అవ్వుతుందని అన్నాడు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై