ఏపీకి హోదాపై అభయ హస్తం...ఇదే కాంగ్రెస్ నినాదం

రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఏపీలో మనుగడ కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పునర్వైభవం కోసం ఆపసోపాలు పడుతోంది.

గుద్ది కన్నా మెల్ల నయం అన్నట్టు పార్టీని ఏపీలో పూర్తిగా వదిలెయ్యడంకంటే అంతో ఇంతో పైకి లాగడం బెటర్ అన్న ఆలోచనలో కాంగ్రెస్ హై కమాండ్ ఉంది.

అందుకే మళ్ళీ పార్టీకి జవసత్వాలు తీసుకొచ్చేందుకు కీలక నాయకులను రంగంలోకి దింపింది.ఇదే సమయంలో ఏపీ ప్రజల మనసు గెలుచుకుని వాటిని ఓట్ల రూపంలో మార్చుకోవాలంటే ఏమి చేయాలి అనే విషయం మీద తీవ్ర కసరత్తు చేసిన ఆ పార్టీ పెద్దలు ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చి అదే అజెండాతో ముందుకు వెళ్లాలని చూస్తోంది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ గత నాలుగేళ్లుగా ఏపీలో పార్టీని బతికించడానికి కాంగ్రెస్ అధినాయకత్వం ఆపసోపాలు పడుతోంది.

అయినప్పటికీ ఆ పార్టీ అడుగు ముందుకు వేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోయింది.అటు దేశంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ నెలకొంటున్న రాజకీయ పరిణామాలు అంచనా వేసిన కాంగ్రెస్ అధినాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సానుకూల వాతావరణం ఉందని భావిస్తోంది.

దీంతో పార్టీని పటిష్టం చేయడం, చేజారిపోయిన క్యాడర్ ను దార్లోకి తెచ్చుకోవటానికి ప్రయత్నాలు ప్రారంభించింది.

దీనిలో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని తిరిగి కాంగ్రెస్ లోకి తీసుకుంది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ప్రత్యేక హోదా సెంటిమెంటును నినాదంగా తీసుకొని ప్రజల దగ్గరకు వెళ్లాలని ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా విజయవాడ సమావేశంలో తీర్మానం కూడా చేసుకున్నారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా నినాదంతో అక్టోబర్ రెండో తేదీ నుంచి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వెళ్లడానికి కార్యాచరణ రూపొందించింది.

ఈ నినాదం వల్ల కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తో పాటు ఏపీలో వైసీపీని దెబ్బకొట్టాలని ఆ పార్టీ ఓట్లకు గండి కొట్టాలని కాంగ్రెస్ ప్లాన్.

వీటితో పాటుగా రైతులకు రుణమాఫీ అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నినాదంగా మార్చుకుంది.

దీని ద్వారా రాష్ట్రంలో మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుందని ఆ పార్టీ భావిస్తోంది.

అయితే ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్ క్యాడర్ లేకుండా పోయింది.ఇప్పుడు జీరో నుంచి క్యాడర్‌ ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.

ఈ దిశగా ఆ పార్టీ అధినాయకత్వం ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తోంది.

రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం..!