అదానీపై మరోసారి రాహుల్ గాంధీ ఫైర్
TeluguStop.com
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అదానీపై మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.దేశంలో కరెంట్ బిల్లులు పెరగడానికి అదానీయే కారణమని ఆరోపించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత అదానీ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతామని రాహుల్ గాంధీ తెలిపారు.
ప్రజల డబ్బు దోచుకుంటున్న అదానీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాపాడుతున్నారని ఆరోపించారు.లేకపోతే అదానీపై ప్రధాని మోదీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
ఇప్పటికైనా అదానీ సంస్థలు, కంపెనీలపై మోదీ దర్యాప్తు చేయించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
నాని ప్యారడైజ్ సినిమాలో మలయాళం స్టార్ హీరో…