బీఆర్ఎస్, బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శలు..!

ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీ, బీఆర్ఎస్ లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

బీజేపీ విభజన రాజకీయాలు చేసిందని ఆరోపించారు.మన దేశ సంస్కృతి ఇది కాదన్న రాహుల్ గాంధీ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడం బీజేపీ విధానమని విమర్శించారు.

దేశ వ్యాప్తంగా తనపై కేసులు పెట్టారన్న ఆయన ఎంపీల నివాసం నుంచి తనను వెళ్లగొట్టినా తాను బాధపడలేదని పేర్కొన్నారు.

దేశ ప్రజల గుండెల్లో తనకు ఇల్లు ఉందన్నారు.ప్రేమను పంచాలనే లక్ష్యంతోనే భారత్ జోడో యాత్ర చేసినట్లు చెప్పారు.

కాంగ్రెస్ ను డ్యామేజ్ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు.బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ ఒక్కటేనని తెలిపారు.

అవినీతిపరుడైన కేసీఆర్ పై ఒక్క కేసు కూడా లేదన్నారు.తెలంగాణలో దొరల పాలన సాగుతోందన్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రజా పాలన చేస్తుందని తెలిపారు.

ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని వెల్లడించారు.

ఒక చిన్న ల‌వంగాన్ని ఎన్ని విధాలుగా వాడొచ్చో తెలుసా..?