మోదీ ప్రభుత్వం టార్గెట్ గా రాహుల్ గాంధీ కామెంట్స్
TeluguStop.com
అమెరికాలో పర్యటిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.మోదీ సర్కార్ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు.
ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు.
అంతా తమకే తెలుసని మోదీ అనుకుంటారన్న రాహుల్ గాంధీ దేవుడికన్నా కూడా తమకే ఎక్కువ తెలుసని భావిస్తారని చెప్పారు.
కేంద్రంపై వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడిన వారిని వేధిస్తుందన్నారు.భారత్ లో మీడియా బీజేపీ కోసమే పని చేస్తోందని ఆరోపించారు.
తన భారత్ జోడో యాత్రను అడ్డుకోవాలని చూశారన్న రాహుల్ గాంధీ తమిళనాడులో హిందీ భాషను రుద్దే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
నాన్నను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాం….నారా బ్రాహ్మణి కామెంట్స్ వైరల్!