ఏ పి లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు తలపెట్టిన భారత్ జోడో యాత్ర ఏపీలో ప్రవేశించింది.

రాహుల్ పాదయాత్ర నేడు కర్ణాటకలోని చిత్రదుర్గ నుంచి ప్రారంభమై అనంతపురం జిల్లా డి.

హీరేహాళ్ సరిహద్దుకు చేరుకుంది.రాహుల్ గాంధీకి ఏపీ పీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్, పార్టీ సీనియర్ నేత రఘువీరారెడ్డి తదితర నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు.

ఈ భారత్ జోడో యాత్ర కాసేపట్లో డి.హీరేహాళ్ చేరుకోనుంది.

రాహుల్ గాంధీ డి.హీరేహాళ్ లోని మారెమ్మ గుడి వద్ద విశ్రాంతి తీసుకోనున్నారు.

రాహుల్ ఈ సాయంత్రం ఓబుళాపురం మీదుగా బళ్లారి బయల్దేరతారు.

బాలయ్య ఎన్టీయార్ కాంబోలో మిస్ అయిన మల్టీ స్టారర్ సినిమా ఏంటో తెలుసా..?