కాంగ్రెస్ బారం వదిలించుకున్న రఘువీరా... పార్టీ మార్పు కోసమేనా

ఏపీ రాష్ట్ర విభజన పాపం నెత్తిన పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో పూర్తిగా భూస్థాపితం అయిపొయింది అని చెప్పాలి.

ఓ విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని వైసీపీ పూర్తిగా ఆక్రమించేసింది.దీంతో కాంగ్రెస్ పార్టీ కనీసం సొంత క్యాడర్ కూడా ఏపీలో లేకుండా అయిపొయింది.

రాహుల్ గాంధీ ఏపీ వచ్చి పార్టీకి పునర్జీవం తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చూసిన ఏపీ ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీని క్షమించే అవకాశమే లేదని తేల్చి చెప్పేశారు.

ఆ పార్టీ తరుపున తాజా ఎన్నికలలో ఎవరు పోటీ చేసారో కూడా ప్రజలకి తెలియదు.

ఇక ఏపీలో కాంగ్రెస్ పార్టీ కోలుకోవడం అంటే ఇప్పట్లో జరిగేది కాదు.ఇక ఆ పార్టీలో ఎదగాలని అనుకోవడం ఆత్మహత్యా సాదృశ్యం అవుతుంది అని చెప్పాలి.

దీంతో కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉన్న చోట మోటా నేతలు కూడా వదిలేస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఏపీ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉండి ఇన్ని రోజులు అతి కష్టం మీద నడిపిస్తూ వచ్చిన రఘువీరారెడ్డి కూడా పార్టీ నడిపించడం తన వలన కాదని వదిలించుకున్నారు.

గతంలోనే పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ప్రస్తుతం అది సంపూర్ణం అయ్యింది.

రఘువీరా తన రాజకీయ భవిష్యత్తు కోసమే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ వర్గాలలో టాక్ వినిపిస్తుంది.

కాంగ్రెస్ ని నమ్ముకుంటే ఇక ఏ విధంగాను ప్రయోజనం ఉండదని బావించి ఫైనల్ గా పార్టీ నుంచి తప్పుకోవడానికి ముందుగా అద్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది.

మరి రఘువీరా తన రాజకీయ భవిష్యత్తు కోసం నెక్స్ట్ ఏ పార్టీని ఎంచుకుంటారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది.

భార్య, పిల్లలను చంపేందుకు ఎన్నారై డాక్టర్ ప్రయత్నం.. కట్ చేస్తే..??