నన్ను స్పీకర్ గా చూడాలనుకుంటున్నారు అంటూ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు..!!
TeluguStop.com

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు( Narsapuram MP RaghuramaKrishnamraju ) అందరికి సుపరిచితులే.2019 ఎన్నికలలో వైసీపీ పార్టీ తరపున గెలిచిన ఆయన.


కొన్ని కారణాలవల్ల ఆ పార్టీకి దూరం కావడం జరిగింది.ఈ క్రమంలో కొన్ని కేసులు కూడా ఎదుర్కోవటంతో ఢిల్లీలోనే ఉంటూ రాజకీయం చేస్తూ ఉండేవాళ్ళు.


ప్రజా సమస్యల విషయంలో తనదైన శైలిలో సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు.
కాగా సరిగ్గా ఎన్నికలు దగ్గర పడిన క్రమంలో వైసీపీకి రాజీనామా చేసిన రఘురామకృష్ణరాజు.
నరసాపురం ఎంపీగా కూటమి అభ్యర్థిగా పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు.కానీ టికెట్టు దక్కలేదు.
"""/"/
ఈ క్రమంలో కొంత నిరుత్సాహానికి గురైన రఘురామకృష్ణరాజు.లేటెస్ట్ గా సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి( TDP BJP Janasena ) అభ్యర్థిగా పోటీ చేయటం తన ఆశయమని అన్నారు.
పెదమిరంలో మీడియాతో మాట్లాడుతూ.నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తాను అన్నది మరో రెండు రోజుల్లో తేలనుంది.
ఎంపీగా.? లేదా ఎమ్మెల్యేగా.
? అనేది క్లారిటీ రానుంది.కానీ ఎన్నికలలో పోటీ చేయటం అనేది పక్కా.
ఎంపీగా పోటీ చేయాలనేది నా ఆశ.అసెంబ్లీలో ఉండాలనేది ప్రజల కోరిక.
చాలామంది నన్ను అసెంబ్లీలో స్పీకర్ గా( Assembly Speaker ) చూడాలనుకుంటున్నారు అంటూ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా రఘురామకృష్ణ రాజు పోటీ చేసే అవకాశాలున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
సందీప్ రెడ్డి వంగా షరతులను స్టార్ హీరో ప్రభాస్ అంగీకరించారా.. ఏం జరిగిందంటే?