పవన్ పోటీ చేసేది అక్కడి నుంచే ? క్లారిటీ ఇచ్చిన రఘురామ 

ఏపీలో జరగబోయే ఎన్నికలు అన్ని పార్టీలకు టెన్షన్ పుట్టిస్తున్నాయి.ఈసారి ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

వైసిపి మరోసారి తమ విజయం ఖాయమని ధీమా గా ఉండగా , బిజెపి , జనసేన పొత్తులతో ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి.

ఇక టిడిపి సైతం ఈ రెండు పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళ్లి సక్సెస్ కావాలని చూస్తోంది.

ఇక సీట్ల సర్దుబాటు వ్యవహారమే ఒక కొలిక్కి రావాల్సి ఉంది.ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది చాలా రోజులుగా ఆసక్తికరంగా మారింది.

గత ఎన్నికల్లో భీమవరం,  గాజువాక నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు.ఈ రెండు చోట్ల ఆయన ఓటమిని చవిచూశారు.

దీంతో ఈసారి జరగబోయే ఎన్నికలను పవన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.కచ్చితంగా గెలుపు అవకాశం ఉన్న నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు.

ఈ క్రమంలోనే పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గం గురించి వైసిపి రెబల్ ఎంపీ రఘురాం కృష్ణంరాజు( MP Raghurama Krishnam Raju ) క్లారిటీ ఇచ్చారు.

వచ్చే ఎన్నికల్లో పవన్ ను భీమవరం( Bhimavaram ) నుంచి పోటీ చేసేలా ఒప్పించానని ఆయన చెబుతున్నారు.

భీమవరంలో పవన్ 2019 ఎన్నికల్లో పోటీ చేయగా,  ఆయనకు 62 వేలకు పైగా ఓట్లు లభించాయి.

"""/" / అలాగే టిడిపికి 50వేల ఓట్లు దక్కాయి.మొత్తం భీమవరంలో పోలింగ్ జరిగిన ఓట్లలో 32 శాతం ఓట్లు పవన్ కళ్యాణ్ కు వచ్చాయి .

ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో వైసిపి అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్( Grandhi Srinivas ) విజయం సాధించారు.

ప్రస్తుతం గ్రంధి శ్రీనివాస్ గ్రాఫ్ తగ్గిపోవడం, ఆయన జనాల్లోకి పెద్దగా , వైసిపి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఇవన్నీ లెక్కలు వేసుకుంటే వచ్చే ఎన్నికల్లో పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తే భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంటుందని పవన్ సైతం అంచనా వేస్తున్నారు.

"""/" / భీమవరం నుంచి పోటీ చేయాలని జనసైనికులు ఒత్తిడి చేస్తున్నారట.అలాగే గత ఎన్నికల్లో భీమవరం నుంచి పవన్ ఓటమి చెందడం తో ఇప్పుడు అదే నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేసి విజయం సాధిస్తే తమపై వచ్చిన విమర్శలకు చెక్ పెట్టే అవకాశం ఉంటుందని పవన్ సైతం భావిస్తున్నారట.

ఇక ఇటీవలే ఢిల్లీ లో పవన్ కళ్యాణ్ ను రఘురామ కృష్ణంరాజు ఢిల్లీలో కలిశారు.

ఈ సందర్భంగా భీమవరంలో పోటీ విషయం వీరి మధ్య చర్చ జరిగిందట.

రెండు వాషుల్లో చుండ్రు మొత్తం పోవాలా.. అయితే ఈ రెమెడీ మీ కోసమే!