అనుకున్నది సాధించిన రఘురామ ! రామరాజు పరిస్థితేంటి ?

గత కొద్దిరోజులుగా ఏపీలోని ఉండి నియోజకవర్గ వ్యవహారం టిడిపికి తలనొప్పిగా మారుతూ వచ్చింది.

ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు( Mantena Rama Raju )నే అభ్యర్థిగా గతంలోనే చంద్రబాబు ప్రకటించారు.

దీంతో ఆయన పూర్తిగా ఎన్నికల ప్రచారంలో నిమగ్నం అయ్యారు.నియోజకవర్గంలో ఒకపక్క రామరాజు, మరోపక్క ఆయన సతీమణి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ వస్తున్నారు.

అయితే నరసాపురం ఎంపీ స్థానంపై ఆశలు పెట్టుకున్న రఘురామకృష్ణంరాజు అక్కడ అవకాశం దక్కకపోవడంతో, ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు.

ఈ విషయంలో రామరాజు వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది.దీంతో రామరాజును ఒప్పించేందుకు చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు.

ఈ విషయంలో రామరాజుని ఒప్పించినట్టుగానే కనిపిస్తున్నారు.తాజాగా ఉండి తో పాటు, నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్థులను మార్చింది.

ఒకపక్క నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండగానే, అభ్యర్థుల మార్పు వ్యవహారం టిడిపిలో సంచలనంగా మారింది.

ఈ మార్పు చేర్పులు చేపట్టిన నియోజకవర్గాల్లో ఉండి నియోజకవర్గం కూడా ఉంది.ఇక్కడ టిడిపి అభ్యర్థిగా రఘురాం కృష్ణంరాజును ప్రకటించడంతో పాటు, ఆయనకు బి ఫామ్ ను సైతం చంద్రబాబు అందజేశారు.

ఈరోజు రఘురాం కృష్ణంరాజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. """/" / ఈ మేరకు భారీ జన సందోహం మధ్య నామినేషన్ వేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.

టిడిపి, జనసేన, బిజెపి పొత్తులో భాగంగా టిడిపి 144 అసెంబ్లీ స్థానాలు, 17 ఎంపీ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.

వీరిలో చాలామంది ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేయగా, కొంతమంది నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ సమయంలోనే మార్పు చేర్పులు చేపట్టడం చర్చినియాంశంగా మారింది.ఉండి టిడిపి అభ్యర్థిగా రఘురామ కృష్ణంరాజు( Raghu Rama Krishna Raju )ను ప్రకటించడంతో మంతెన రామరాజుకు నరసాపురం పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చి చంద్రబాబు ఒప్పించారు.

"""/" / ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి ని టిడిపి పొలిట్ బ్యూరో లోకి తీసుకున్నారు .

ఇక పెందుర్తి స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో అక్కడ అవకాశం కోల్పోయిన బండారు సత్యనారాయణమూర్తికి మాడుగుల స్థానాన్ని కేటాయించారు.

పాడేరు టికెట్ ను గతంలో వెంకట రమేష్ నాయుడుకి కేటాయించగా, ఆయనను మార్చి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి అవకాశం ఇచ్చారు.

మడకశిర నుంచి సునీల్ కుమార్ స్థానంలో ఎమ్మెస్ రాజుకు చాన్స్ ఇచ్చారు.వెంకటగిరి స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీ ప్రియకు గతంలోనే ఖరారు చేయగా, ఇప్పుడు ఆమెను తప్పించి రామకృష్ణనే అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు.

దేవర నాలుగో రోజు కలెక్షన్ల లెక్కలు ఇవే.. ఏకంగా ఆ రేంజ్ లో సాధిస్తోందా?