ఇండస్ట్రీని వాయిస్తాడని అప్పుడే అనుకున్న.. మాస్ రాజాపై దర్శకేంద్రుడు కామెంట్స్!

మాస్ మహారాజా రవితేజ ప్రెసెంట్ రవితేజ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాలో రవితేజకు జోడీగా పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల నటిస్తుంది.ఇటీవల కాలంలో మాస్ మహారాజా రవితేజ సినిమాలకు భారీ క్రేజ్ రావడం లేదు.

అందుకు చాలా కారణాలే ఉన్నాయి.ఈయన ఒక సినిమాతో హిట్ అందుకుంటే వరుస ప్లాప్స్ అందుకుంటున్నాడు.

దీంతో రవితేజ సినిమాలు అంటే క్రేజ్ తగ్గిపోతుంది.అయితే తాజాగా రిలీజ్ చేయబోయే సినిమాపై మాత్రం ఎప్పుడు లేనంత క్రేజ్ పెరిగి పోయింది.

రవితేజ కూడా ఈ సినిమా కోసం రెండు వారాల ముందు నుండే వరుస ప్రొమోషన్స్ లో పాల్గొంటూ బిజీ బిజీగా ఉన్నాడు.

ఇక తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి ఘనంగా జరిగింది.

మరి ఈ ఈవెంట్ కు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కూడా గెస్ట్ గా విచ్చేశాడు.

దీనిలో భాగంగానే ఈయన ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు వైరల్ అయ్యింది.ఈ ఈవెంట్ లో ఈయన మాట్లాడుతూ.

అల్లరి ప్రియుడు సినిమాలో డ్రమ్స్ వాయించడం చూసే.ఇతను ఇండస్ట్రీని వాయిస్తాడని అనుకున్న.

మాస్ రాజా అవుతాడనై అప్పుడే అనుకున్నాను అని రవితేజ మీద ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు.

ఇక శ్రీలీల తన పెళ్లి సందడి సినిమాతోనే ఎంట్రీ ఇచ్చి తెలుగు రాష్ట్రాలను ఊపేసి అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకుంది అని అన్నారు.

"""/"/ ఇంకా త్రినాథరావు ఎంటర్టైన్మెంట్ కు మార్క్ వేసుకున్నారు అని ఈ సినిమా కూడా మంచి ఫలితాన్ని ఇవ్వాలని చెప్పుకొచ్చారు.

ఈయన ఇచ్చిన స్పీచ్ నెట్టింట వైరల్ అయ్యింది.ఇక ఈ సినిమాను క్రిస్మస్ బరిలో దింపబోతున్న విషయం తెలిసిందే.

డిసెంబర్ 23న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.వివేక్ కూచిభట్ల సహా నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇంక భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు.

యూఎస్: ఆ కారణంతో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంటుందట.. అందరూ షాక్..?