నేను లైఫ్ లో తీయలేకపోయానని బాధపడ్డ 3 సినిమాలు : కె రాఘవేంద్రరావు

కొన్ని సినిమాలు చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది.కొన్ని సినిమాలు చూసినప్పుడు చాలా బాధపడుతుంటాం.

ఇలాంటి సినిమా నేను చెయ్యలేకపోయానే అని చాలామంది దర్శకులు అనుకుంటూ ఉంటారు.కొన్ని సార్లు వారు అనుకున్నట్టు డ్రీం ప్రాజెక్టు సాధించుకున్న అది అందరికి అన్ని సార్లు కుదరదు.

ఆలా వంద సినిమాలకు పైగా డైరెక్షన్ చేసింది రాఘవేంద్ర రావు గారికి కూడా కొన్ని డ్రీం ప్రాజెక్ట్స్ ఉండేవి అంట.

అలా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తన లైఫ్ లో చేయలేకపోయినా ఆ మూడు సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

"""/" / H3 Class=subheader-styleగాంధీ : /h3pగాంధీ సినిమా మన మీద పెత్తనం జలాయించిన బ్రిటిష్ వాళ్ళు తీసిన ఒక గొప్ప సినిమా గాంధీ.

కుళ్ళాయి కట్టి, ఒక చిన్న కర్రచేత పట్టి, అహింస ని ఆయుధంగా చేసుకుని బ్రిటిష్ వారిని తరిమికొట్టి, మనకు స్వాతంత్రం తెచ్చిన గాంధీ తాత కథని ఆ బ్రిటిష్ వారే హృదయానికి హత్తుకునేలా గొప్పగా తీశారు.

ఆ సినిమా స్క్రీన్ ప్లే తీసిన విధానం చూసినప్పుడు దాన్ని తీయలేకపోయానని బాధ దర్శకేంద్రుడికి చాలాసార్లు అనిపించిందట.

"""/" / H3 Class=subheader-styleబాగ్ మిల్కా బాగ్:/h3p స్పోర్ట్స్ మాన్ జీవితాన్ని గొప్ప స్క్రీన్ ప్లే తో గొప్పగా తీశారు అప్పుడు తాను కూడా ఒక జీవితాన్ని సినిమా తీయలేకపోయినందుకు బాధపడ్డారట రాఘవేంద్రరావు.

బయోపిక్ అంటే సుమారు 60 ఏళ్ల మనిషి జీవిత కథ రెండు గంటల్లో చూపిస్తున్నప్పుడు ఒక సినిమా కథకు అంతకన్నా ఎక్కువగా ఎందుకు ? ఆడియన్స్ ని ఎంత త్వరగా వదిలేస్తే అంత మంచిది కదా ? వాళ్లకు వేరే పనులు ఉంటాయి కదా అని అనిపించేదట.

"""/" / H3 Class=subheader-styleలగాన్: /h3pమనదైన కర్ర బిళ్ళ ఆటలాడే పల్లెటూరు వాళ్లు వాళ్లదైనా క్రికెట్ ఆటలో బ్రిటీష్ ఆట కట్టించి, తమ సత్తాని దేశభక్తిని వెండితెరపై గొప్పగా ప్రదర్శించిన లగాన్ సినిమా చూసినప్పుడు తాను ఎందుకు చేయలేకపోయానా అని మూడోసారి బాధపడ్డారట.

ఇలా ఈ మూడు సినిమాలు ఇప్పటికి కూడా ఆయనకు తీయడం సాధ్యపడలేదు.ఇక ముందు జరుగుతాయో లేదో తెలియదు.

ఆరు నెలల్లో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు.. ఈ యువతి సక్సెస్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!