జిగర్తండ కి ఓపెనింగ్స్ కష్టాలు తప్పేలా లేవు…
TeluguStop.com
ఈనెల 10వ తేదీన తమిళ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ చేసిన జిగిర్తండ సినిమా ( Jigarthanda )రిలీజ్ అవుతుంది.
ఇక ఈ క్రమంలో ఈ సినిమాలో నటించిన రాఘవ లారెన్స్( Raghava Lawrence ) ,ఎస్ జె సూర్య లాంటి నటులు ఈ సినిమాని వాళ్ల భుజాలపై మోసుకొని వెళ్లి హిట్ చేస్తారు అనే కాన్ఫిడెంట్ తో చిత్ర యూనిట్ అయితే ఉంది.
ఇక ఈ సినిమా తమిళ్ తో పాటు గా తెలుగులో కూడా ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్తున్నారు.
ఇక ఈ సినిమా లీడ్ రోల్ చేసిన ఎస్ జే సూర్య, రాఘవ లారెన్స్ ఇద్దరు కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అవ్వడంతో ఈ సినిమాకి తెలుగులో కొంత మేరకు ఓపెనింగ్స్ అయితే వచ్చే అవకాశం ఉంది.
ఇక గత వారం రిలీజ్ అయిన పొలిమేర 2 , కీడా కోలా సినిమాలు కూడా ఇప్పుడు మంచి వసూళ్ల ను రాబట్టుకున్నాయి.
"""/" /
అయితే జిగిర్తండా సినిమాకి ఏ మేరకు కలెక్షన్స్ వస్తాయనేది ఇప్పుడు తెలియాల్సిన విషయం.
ఈ సినిమా కి ఓపెనింగ్స్ విషయం లో కొంత కలక్షన్స్ అయితే తగ్గే అవకాశం ఉంది.
కానీ సినిమా బాగుంటే మాత్రం తెలుగులో మంచి కలక్షన్స్ ని వసూల్ చేస్తుంది అని అనడం లో ఎంత మాత్రం సందేహం లేదు.
ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది అయినప్పటికీ సినిమా చూసే ప్రేక్షకుడు థియేటర్ దాకా వెళ్లాలంటే ఈ సినిమాలో ఉన్న ఎలిమెంట్స్ ప్రేక్షకుల్ని థియేటర్ వరకు రప్పించేలా కనిపించడం లేదు.
"""/" /
దాంతో సినిమాకి భారీ ఓపెనింగ్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే లేవు.
ఇక ప్రేక్షకుడికి నచ్చిన ఎలిమెంట్స్ ట్రైలర్ లో గనక ఉన్నట్టయితే ప్రేక్షకులు థియేటర్ వరకు వస్తారు లేదంటే సినిమాకి హిట్ టాక్ వచ్చిన తర్వాత అప్పుడు నిదానంగా వచ్చి చూస్తారు.
ఒకవేళ బాగాలేదు అనే టాక్ వస్తే సినిమాను చూడాలనే ఆలోచన కూడా మనుకుంటారు.
అయితే సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా మొదటిరోజు చూసే వాళ్ళ వల్ల మాత్రమే సినిమాకి ఓపెనింగ్స్ వస్తాయి.
దూకుడు పెంచిన ఐటీ అధికారులు…దిల్ రాజుతో పాటు మైత్రి పై ఐటి దాడులు?