చంద్రముఖి 2 చూస్తే నిద్ర కూడా పట్టదు.. ట్విట్టర్ రివ్యూ ఇదే!
TeluguStop.com
ఈ రోజు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ దగ్గర మాస్ జాతర అనే చెప్పాలి.
ఎందుకంటే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన గ్రాండ్ సినిమాలు ఈ రోజు రిలీజ్ కాబోతున్నాయి.
బోయపాటి స్కంద( Skanda ) మాత్రమే కాదు కోలీవుడ్ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన చంద్రముఖి 2( Chandramukhi 2 ) కూడా ఈ రోజే రిలీజ్ కానున్నాయి.
ఈ నేపథ్యంలోనే థియేటర్స్ దగ్గర కోలాహలంగా ఉంది.ఇప్పటికే ప్రీమియర్స్ ను వీక్షించిన ప్రేక్షకులు ఈ సినిమాలు ఎలా ఉన్నాయో చెప్పే ప్రయత్నం చేస్తూ ట్విట్టర్ లో వారి రివ్యూలు ఇస్తున్నారు.
చంద్రముఖి మూవీ దాదాపు 17 ఏళ్ల క్రితం వచ్చి బ్లాక్ బస్టర్ అందుకుంది.
రజనీకాంత్ కెరీర్ లో ( Rajinikanth ) మరపురాని సినిమాలలో చంద్రముఖి ఒకటి.
2005 లో రిలీజ్ అయిన ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు భాషలో కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
"""/" /
ఇక ఇప్పటికి సీక్వెల్ కు ముహూర్తం కుదిరి మళ్ళీ సెట్స్ మీదకు వెళ్లి పూర్తి చేసారు.
రాఘవ లారెన్స్( Raghava Lawrence ) మెయిన్ రోల్ లో నటించగా ఈయనకు జోడీగా కంగనా రనౌత్( Kangana Ranaut ) హీరోయిన్ గా నటించడంతో ఈ సినిమాపై బాలీవుడ్ లో సైతం అంచనాలు పెరిగాయి.
ఈ సినిమాను ఈ రోజు పాన్ ఇండియా వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.
మరి ప్రీమియర్స్ చూసిన ప్రేక్షుకులు ఈ సినిమా రివ్యూను చెబుతున్నారు. """/" /
సినిమాను చూసిన మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి( Keeravani ) రివ్యూ ఇస్తూ ఈ సినిమాను చుస్తే కొద్దీ రోజుల పాటు నిద్రపట్టదు అని అంతలా సినిమా భయపెట్టింది చాలా బాగా సినిమాను తీశారు అంటూ రాసుకొచ్చారు.
ఇక ఈయన రివ్యూ చూసిన ఫ్యాన్స్ మీ రివ్యూ చూసి సినిమాకు వెళ్తున్నాం అని మైండ్ బ్లోయింగ్ సన్నివేశాలు ఉండకపోయినా ఎంజాయ్ చేసే విధంగా ఉంటే చాలని ప్రేక్షకులు చెబుతున్నారు.
మొత్తానికి చంద్రముఖి సినిమా ఆడియెన్స్ ను ఎలా అలరిస్తుందో చూడాలి.
మహేష్ బాబు, సూర్య క్లాస్ మేట్స్ అని మీకు తెలుసా.. ఈ హీరోలు చిన్నప్పుడు అలా ఉండేవార?