చిన్న వయస్సులోనే అమ్మాయి చదువు కోసం సాయం చేస్తున్న లారెన్స్ కొడుకు.. ఏమైందంటే?

రాఘవ లారెన్స్( Raghava Lawrence ).ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

కొరియోగ్రాఫర్ గా, దర్శకుడిగా, నటుడిగా, హీరోగా ఇలా అన్ని రంగాల్లో రాణిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.

అంతేకాకుండా కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేస్తూ తన గొప్ప మనసును చాటుకుంటూ ప్రతి ఒక్కరి చేత శభాష్ లభించుకుంటున్నాడు.

తమిళనాడులో( Tamil Nadu ) తన అమ్మగారి పేరుతో ఒక ట్రస్ట్‌ ఏర్పాటు చేసి ఎందరికో లారెన్స్‌ సాయం చేశారు.

ఈ క్రమంలో గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారులకు ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేపించి తన మంచి మనుసు చాటుకున్నారు.

"""/" / ఇప్పటికే ఎంతో మందికి సహాయం చేసిన విషయం తెలిసిందే.ఈ మధ్యకాలంలో సినిమాలకు సంబంధించిన విషయాల కంటే ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు లారెన్స్.

కేవలం సహాయం చేయడమే మాత్రమే కాదండోయ్ చాలామందికి ఉపాధిని కూడా కల్పించారు.ట్రాక్టర్స్‌, బైక్స్‌, ఆటోలు, తోపుడు బండ్లు, వికలాంగులకు వాహనాలు ఇలా ఎందరికో లారెన్స్‌ అందించారు.

సినిమా స్టార్స్‌ అందరూ ఎప్పుడు తమ బిడ్డలను చిత్ర పరిశ్రమలోకి తీసుకుని వద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు.

కానీ లారెన్స్‌ అందుకు భిన్నమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. """/" / ఇతరులకు సాయం చేసే తన సేవా గుణాన్ని వారసత్వంగా తన కుమారుడికి ఇచ్చారు.

చిన్న వయసు నుంచే ఇతరులకు సాయం చేసే అలవాటును పరిచయం చేపించారు.ఈ క్రమంలో లారెన్స్‌ ఒక వీడియో పంచుకుంటూ ఇలా చెప్పుకొచ్చారు.

అభిమానులకు, స్నేహితులకు విన్నపం.వీడు మా అబ్బాయి శ్యామ్‌( Shyam ).

అప్పుడే పెద్దవాడు అయిపోయాడు.ప్రస్తుతం కాలేజీలో 3వ సంవత్సరం చదువుతూ పార్ట్‌టైమ్ జాబ్‌లో కూడా పనిచేస్తున్నాడు.

అయితే, గత పదేళ్లుగా నేను హెప్సిబా అనే అమ్మాయి చదువు కోసం నా వంతు డబ్బు సాయం చేస్తున్నాను.

తమిళనాడులోని రాయపురంలో ఉన్న హెప్సిబా చిన్నప్పటి నుంచి అమ్మమ్మ దగ్గరే ఉంది.ఇప్పుడు, హెప్సిబా కోసం శ్యామ్ ఈ సంవత్సరం స్కూల్ ఫీజు చెల్లిస్తున్నాడు.

ఈ సంతోషకరమైన క్షణాన్ని మీ అందరితో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది.

ఇక నుంచి శ్యామ్ తన సేవా యాత్రను కొనసాగిస్తాడు.దీనికి మీ అందరి ఆశీస్సులు కావాలి అని లారెన్స్‌ రాసుకొచ్చాడు.

ఇప్పటి వరకు లారెన్స్‌ ఎందరికో సాయం చేశారు.ఇప్పుడు తన కుమారుడిని కూడా అదే మార్గంలో నడిపించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు.

వాళ్లకు క్షమాపణలు చెప్పిన సంక్రాంతికి వస్తున్నాం బుల్లిరాజు.. అసలేం జరిగిందంటే?