మరోసారి మంచి మనస్సు చాటుకున్న లారెన్స్.. వారికి కుట్టు మిషన్లు ఇవ్వడంతో?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో రాఘవ లారెన్స్ కు మంచి గుర్తింపు ఉంది.కొరియోగ్రాఫర్ గా, యాక్టర్ గా రాఘవ లారెన్స్ ( Raghava Lawrence )తన కీర్తి ప్రతిష్టలను పెంచుకున్నారు.
రాఘవ లారెన్స్ రెమ్యునరేషన్ సైతం గతంతో పోల్చి చూస్తే భారీ స్థాయిలో పెరిగింది.
ప్రస్తుతం రాఘవ లారెన్స్ రమేష్ వర్మ( Ramesh Verma ) డైరెక్షన్ లో యాక్షన్ అడ్వెంచరస్ సినిమాలో నటించనున్నారు.
సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా లారెన్స్ హీరో అని చాలామంది భావిస్తారు.
"""/" /
రాఘవ లారెన్స్ తన ఫౌండేషన్ ద్వారా పేదలు, రైతులకు తన వంతు సహాయసహకారాలు అందిస్తారు.
వికలాంగులు, రైతులకు సైతం లారెన్స్ అండగా నిలబడ్డారు.ఈరోజు తన పుట్టినరోజు కావడంతో లారెన్స్ పేద వితంతు మహిళలకు అండగా నిలబడటంపై ప్రశంసలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
వితంతు మహిళలకు కుట్టు మిషన్లు అందించడం ద్వారా లారెన్స్ వార్తల్లో నిలిచారు.లారెన్స్ మరోసారి గొప్ప మనస్సును చాటుకోవడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
ఈ విషయం తెలిసిన అభిమానులు రాఘవ లారెన్స్ లాంటి హీరోలు అరుదుగా ఉంటారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
రాఘవ లారెన్స్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఈ హీరో ఖాతాలో మరిన్ని విజయాలు చేరతాయని చెప్పవచ్చు.
లారెన్స్ సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో సైతం బిజినెస్ భారీ స్థాయిలోనే జరుగుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
"""/" /
రాఘవ లారెన్స్ హర్రర్ సినిమాలతో ఎక్కువగా విజయాలను అందుకున్నా ప్రస్తుతం భిన్నమైన జానర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
రాఘవ లారెన్స్ క్రేజ్ మాత్రం వేరే లెవెల్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
రాఘవ లారెన్స్ కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది.రాఘవ లారెన్స్ లుక్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
రాఘవ లారెన్స్ కు భవిష్యత్తు సినిమాలు భారీ విజయాలను అందించాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.
హనుమాన్ పాత్రకు ప్రాణం పోసిన రిషబ్ శెట్టి.. ఈ లుక్ మాత్రం వేరే లెవెల్ అంటూ?