తెలంగాణలో ఆర్టీసీ బిల్లుపై రగడ
TeluguStop.com
తెలంగాణలో ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్టీసీ బిల్లుపై రగడ మొదలైంది.ఈ బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నుంచి అనుమతి రాలేదు.
ఆర్థిక పరమైన బిల్లు కావడంతో అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం బిల్లును గవర్నర్ కు పంపిన సంగతి తెలిసిందే.
గవర్నర్ అనుమతి ఇస్తే ఆర్టీసీ బిల్లును ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
అయితే బిల్లును ఇంతవరకు ఆమోదించలేదు.కాగా ఆర్టీసీ బిల్లుపై రాజ్ భవన్ వర్గాలు ఇప్పటికే క్లారిటీ ఇచ్చాయి.
గవర్నర్ తమిళిసై పుదుచ్చేరి పర్యటనలో ఉన్నారన్న రాజ్ భవన్ వర్గాలు ఆమె తిరిగి వచ్చాక బిల్లును పరిశీలిస్తారని తెలిపాయి.
అదేవిధంగా ఆర్థిక పరమైన బిల్లు కావడంతో ఆమోదం తెలపడానికి కొంత సమయం పడుతుందని పేర్కొన్నాయి.
మరోవైపు గవర్నర్ బిల్లుకు అనుమతి ఇవ్వకపోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.
బిల్లును గవర్నర్ త్వరగా ఆమోదించకపోతే రాజ్ భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారని సమాచారం.
కాగా ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ ఇటీవలే తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే యుద్ధ ప్రాతిపదికన బిల్లును రూపొందించిన సర్కార్ గవర్నర్ అనుమతి కోసం రాజ్ భవన్ కు పంపింది.
రూ.100లోపే ఇల్లు కొనేసింది.. ఇప్పుడు ఆ ఇంటి లుక్కు చూస్తే ఆశ్చర్యపోతారు..