రాఘవేంద్ర రావు సినిమాపై ఏడాది తర్వాత క్లారిటీ

రాఘవేంద్ర రావు సినిమాపై ఏడాది తర్వాత క్లారిటీ

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సినిమా వచ్చి మూడు సంవత్సరాలకు పైగా పూర్తి అయ్యింది.నాగార్జునతో ఈయన తెరకెక్కించిన ఓం నమో వెంకటేశాయ చిత్రం తర్వాత ఇప్పటి వరకు తదుపరి చిత్రంను పట్టాలెక్కించలేదు.

రాఘవేంద్ర రావు సినిమాపై ఏడాది తర్వాత క్లారిటీ

గత ఏడాది ఎన్టీఆర్‌ జయంతి సందర్బంగా రాఘవేంద్ర రావు తాను చేయబోతున్న సినిమాను ప్రకటించాడు.

రాఘవేంద్ర రావు సినిమాపై ఏడాది తర్వాత క్లారిటీ

ముగ్గురు హీరోయిన్స్‌తో ముగ్గురు దర్శకులు తాను తెరకెక్కించబోతున్న సినిమా అంటూ ప్రకటించాడు. """/"/ ఏడాది అయినా ఇప్పటి వరకు ఆ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ లేదు.

అసలు సినిమా ఉందా లేదా అంటూ అనుమానాలు వ్యక్తం అయ్యాయి.ఇలాంటి సమయంలో సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్త ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

స్క్రిప్ట్‌ వర్క్‌ దాదాపుగా పూర్తి అయ్యిందని.షూటింగ్స్‌ ప్రారంభం అయ్యే సమయంకు రాఘవేంద్ర రావు ఈ సినిమాను మొదలు పెట్టేందుకు రంగం సిద్దం చేసే అవకాశం ఉందని అంటున్నారు.

ఈ సమయంలోనే రాఘవేంద్ర రావు ఈ సినిమాలో ఒక హీరోగా నాగశౌర్యను ఎంపిక చేశాడని అంటున్నారు.

"""/"/ ఒకే సినిమాలో మూడు విభిన్నమైన కథలు, ఆ మూడు విభిన్నమైన కథలను ముగ్గురు దర్శకులు తెరకెక్కించడం, ఆ మూడు కథలను కలిపే సీన్స్‌ను తాను తెరకెక్కించడం జరుగుతుందని గతంలోనే రాఘవేంద్ర రావు ప్రకటించాడు.

కాని ఇప్పటి వరకు ఆ విషయంలోనూ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.ఆ ముగ్గురు దర్శకులు ఎవరు అనే విషయంలో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు.

కాని నాగశౌర్య కీలక పాత్రలో కనిపించబోతున్నాడు అనే సమాచారంతో సినిమా ఇంకా లైన్‌లోనే ఉందని, క్యాన్సిల్‌ కాలేదని క్లారిటీ వచ్చేసింది.

మరి వచ్చే ఏడాది అయినా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారా అనేది చూడాలి .