ఢిల్లీ యూనివర్సిటీని తాకిన బీబీసీ డాక్యుమెంటరీ రగడ

బీబీసీ డాక్యుమెంటరీ రగడ ఢిల్లీ యూనివర్సిటీకి చేరింది.ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ది మోదీ క్వశ్చన్ పేరుతో బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని ఇవాళ సాయంత్రం ప్రదర్శించనున్నట్లు పలు విద్యార్థి సంఘాలు తెలిపాయి.

మరోవైపు డాక్యుమెంటరీ స్క్రీనింగ్ ను విద్యార్థి సంఘాల నిరసనలకు అడ్డుకునేందుకు ఢిల్లీ యూనివర్సిటీ సిద్ధంగా ఉందని తెలుస్తోంది.

కాగా ఈ డాక్యుమెంటరీ లింక్స్ ను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేయడాన్ని వామపక్ష విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.

2002లో గుజ‌రాత్ అల్ల‌ర్ల‌కు సంబంధించిన అంశాలు చూప‌డంపై తాము విచార‌ణ చేప‌ట్టాల‌నే పేరుతో స‌మాచార ప్ర‌సార మంత్రిత్వ శాఖ బీబీసీ డాక్యుమెంట‌రీ లింక్స్‌ను తొల‌గించాల‌ని సోష‌ల్ మీడియాను ఆదేశించిన సంగతి తెలిసిందే.

కేజీఎఫ్3 సినిమాలో హీరో అజిత్ అంటూ జోరుగా ప్రచారం.. ఆ ఛాన్స్ ఉందంటూ?