టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ కీలక నిర్ణయం..!

టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ కీలక నిర్ణయం!

టెన్నిస్ స్టార్ ప్లేయర్ రఫెల్ నాదల్ షాకింగ్ డెశిషన్ తీసుకున్నారు.రానున్న వింబుల్డన్ ఛాంపియన్ షిప్ తో పాటుగా టోక్యోలో జరిగే ఒలంపిక్స్ లోనూ పాల్గొనడం లేదని ప్రకటించాడు.

టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ కీలక నిర్ణయం!

టెన్నిస్ దిగ్గజం నాదల్ ఒక్కసారి ఈ నిర్ణయం చెప్పేసరికి టెన్నిస్ లవర్స్ షాక్ అయ్యారు.

టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ కీలక నిర్ణయం!

అయితే ఈ నిర్ణయం అంత సులువుగా తీసుకున్నది కాదని.తన శరీరం సహకరిస్తున్న తీరుని పరిగణలో తీసుకుని తన బృందంతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు.

వింబుల్డన్ ఛాంపియన్ షిప్, ఒలంపిక్స్ లను మిస్ చేస్తున్నట్టు ప్రకటించాడు నాదల్.అయితే తన కెరియర్ మరింత సుధీర్ఘంగా కొనసాగించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని అన్నాడు.

ఇటీవల ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్ టోర్నమెంట్ కు, వింబుల్డన్ కు మధ్య రెండు వారాల సమయం మాత్రమే ఉందని గుర్తుచేశాడు.

క్లే కోర్ట్ లో ఆడిన శరీరం అంత ఈజీగా కుదుటపడదని చెప్పాడు.సుధీర్ఘ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.

యూకె, జపాన్ లో ఉన్న తన అభిమానుల కోసం ప్రత్యేకంగా సందేశం పంపుతున్నానని నాదల్ చెప్పాడు.

ఒక ఆటగాడిగా తనకు ఒలంపిక్స్ కీలకమైందని అన్నాడు.20 గ్రాండ్ స్లాం లు సాధించిన నాదల్ 2008, 2010 వింబుల్డన్ ఛాంపియన్ గా నిలిచాడు.

2008 ఒలంపిక్స్ లో పురుషుల సింగిల్స్ లో గోల్డ్ మెడల్ సాధించాడు.ఈమధ్యనే ముగిసిన ఫ్రెచ్ ఓపెన్ లో జొకోవిచ్ చేతిలో సెమీ ఫైనల్ లో ఓడిపోయాడు.

భర్త వల్లే సంతోషంగా ఉన్నాను.. కల్పన కామెంట్లతో ఫుల్ క్లారిటీ వచ్చేసిందిగా!

భర్త వల్లే సంతోషంగా ఉన్నాను.. కల్పన కామెంట్లతో ఫుల్ క్లారిటీ వచ్చేసిందిగా!